రైతుల ఆనందం కోసమే సంబురాలు

ABN , First Publish Date - 2023-01-17T23:33:21+05:30 IST

రైతుల ఆనందం కోసమే రైతు సంబురాలు నిర్వహిస్తున్నట్లు అలంపూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహాం అన్నారు. మండలంలోని మాన్‌దొడ్డి గ్రామంలో లక్ష్మీ మాధవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఏర్పాటు చేసిన ఎద్దుల బలప్రదర్శన పోటీలను ఆయన ప్రారంభించారు.

రైతుల ఆనందం కోసమే సంబురాలు
ఎద్దుల బండలాగుడు పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అబ్రహాం

- అలంపూర్‌ ఎమ్మెల్యే వీఎం అబ్రహాం

రాజోలి, జనవరి 17 : రైతుల ఆనందం కోసమే రైతు సంబురాలు నిర్వహిస్తున్నట్లు అలంపూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహాం అన్నారు. మండలంలోని మాన్‌దొడ్డి గ్రామంలో లక్ష్మీ మాధవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఏర్పాటు చేసిన ఎద్దుల బలప్రదర్శన పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి ఉచిత కరెంట్‌ అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఎస్‌ ఆయకట్టుదారుల సంఘం మాజీ చైర్మన్‌ తనగల సీతారామిరెడ్డి, వడ్డేపల్లి జడ్పీటీసీ సభ్యుడు రాజు, సర్పంచు సవారి, ఎంపీటీసీ సభ్యుడు మన్సూర్‌, అలంపూర్‌ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ రఘునందన్‌రెడ్డి పాల్గొన్నారు.

అభివృద్ధే లక్ష్యంగా పని చేద్దాం

అయిజ : నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేద్దామని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం పిలుపునిచ్చారు. అయిజలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంగళవారం ఆయన భూమిపూజ చేశారు. మునిసిపాలిటీ పరిధిలో నాయిబ్రాహ్మణ సంఘం కమ్యూనిటీ హాలు, రైతు సంఘం భవనం, ముదిరాజ్‌ సంఘం కమ్యూనిటీ హాలు నిర్మాణాలకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం పాతబస్టాండు నుంచి పోలీస్‌స్టేషన్‌ వరకు సాగిన సీసీ రోడ్డును పరిశీలించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలతో బీఆర్‌ఎస్‌ పార్టీ ముందుకు వెళ్తోందని, మరోమారు ప్రజలు తమను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు పోతుల జనార్దన్‌రెడ్డి, రాముడు, శ్రీదర్‌, నాగిరెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, ఆంజనేయులు, కాశపోగురాజు, మల్లికార్జున్‌, నరేంద్రవర్మ, కౌన్సిలర్‌లు సీఎం సురేష్‌, నర్సింహులు, సువర్ణ, రాణి పాల్గొన్నారు.

Updated Date - 2023-01-17T23:33:22+05:30 IST