మానవీయ కోణంలో స్పందించాలి

ABN , First Publish Date - 2023-04-03T23:28:18+05:30 IST

ప్రమాదాలు జరిగినప్పుడు ప్రతీ ఒక్కరు మానవీయ కోణంలో స్పందించాలని ఎస్పీ సృజన అన్నారు. ఎదుటి వారు ప్రాణపాయ స్థితిలో ఉన్నప్పుడు కాపాడే బాధ్యతను ప్రతీ వ్యక్తి కర్తవ్యంగా భావించాలని కోరారు.

మానవీయ కోణంలో స్పందించాలి
క్షతగాత్రులను రక్షించే మెళకువలను చూపుతున్న సిబ్బంది, పరిశీలిస్తున్న ఎస్పీ

- ఎస్పీ సృజన

- ఫస్ట్‌ యాక్సిడెంట్‌ రెస్పాండర్‌పై ప్రజలకు అవగాహన

ఎర్రవల్లి చౌరస్తా, ఏప్రిల్‌ 3 : ప్రమాదాలు జరిగినప్పుడు ప్రతీ ఒక్కరు మానవీయ కోణంలో స్పందించాలని ఎస్పీ సృజన అన్నారు. ఎదుటి వారు ప్రాణపాయ స్థితిలో ఉన్నప్పుడు కాపాడే బాధ్యతను ప్రతీ వ్యక్తి కర్తవ్యంగా భావించాలని కోరారు. ఇటిక్యాల మండలంలోని కోదండాపురంలో రోడ్‌ సేప్టీ వింగ్‌ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘పస్ట్‌ యాక్సిడెంట్‌ రెస్పాండర్‌’ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు చిన్న నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. వారిని రక్షించే మెళకువలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదాలు జరిగే తీరు, తీసుకోవాల్సిన జరిగినప్పుడు, ఆ సమయంలో ఎలా స్పందించాలో డాక్టర్‌ సతీష్‌ కుమార్‌ వివరించారు. క్షతగాత్రులను కాపాడే విధానాన్ని ప్రాక్టికల్‌గా చూపించారు. ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు మానసిక ధైర్యం కలిగించాలని డీఎస్పీ రంగస్వామి అన్నారు. కార్యక్రమంలో రోడ్‌ సేప్టీ వింగ్‌ డీఎస్పీ చంద్రమోహన్‌, డీసీ అర్బీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, సీఐలు శివశంకర్‌, చంద్రశేఖర్‌, ఎస్‌ఐలు వెంకటస్వామి, బాలరాజ్‌, పీఆర్‌వో సురేశ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి కృషి

గద్వాల క్రైం : ప్రజల నుంచే వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఎస్పీ సృజన అన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి తొమ్మిది ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుదారులతో ఎస్పీ మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సీఐ, ఎస్‌ఐలకు సూచించారు. సివిల్‌ ఫిర్యాదులను కోర్టులో పరిష్కరించుకోవాలని ఫిర్యాదు దారులకు సూచించారు. చిట్‌ఫండ్స్‌ పేరుతో ప్రజలను మోసగించే వారిపై, అదనపు కట్నం కోసం భార్యలను వేధించే వారిపై చట్ట ప్రకారం వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితులలో డయల్‌ 100కు కాల్‌ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Updated Date - 2023-04-03T23:28:18+05:30 IST