పులిగుట్ట మైనింగ్‌పై గ్రామస్థులకు అండగా ఉంటా

ABN , First Publish Date - 2023-03-18T23:09:01+05:30 IST

మండలంలోని అమడ బాకుల గ్రామ శివారులోని పులిగుట్ట మైనింగ్‌ను అడ్డుకోవడంలో గ్రామస్థులకు అండగా ఉంటా నని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. శనివారం గ్రామానికి చేరుకు న్న ఆయన ప్రజలతో కలిసి పులిగుట్టను పరిశీ లించారు.

పులిగుట్ట మైనింగ్‌పై గ్రామస్థులకు అండగా ఉంటా
పులిగుట్టను పరిశీలిస్తున్న దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

కొత్తకోట, మార్చి 18 : మండలంలోని అమడ బాకుల గ్రామ శివారులోని పులిగుట్ట మైనింగ్‌ను అడ్డుకోవడంలో గ్రామస్థులకు అండగా ఉంటా నని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. శనివారం గ్రామానికి చేరుకు న్న ఆయన ప్రజలతో కలిసి పులిగుట్టను పరిశీ లించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆల మాట్లాడారు. తొమ్మిది నెలల కింద టనే గుట్టపై తవ్వాకానికి వస్తే మంత్రి నిరంజన్‌ రెడ్డి, అప్పటి కలెక్టర్‌ యాస్మిన్‌ బాషాలను కలిసి పనులు నిలుపుదల చేయడం జరిగిందన్నారు. అప్పుడే కలెక్టర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా ట్లాడటం ఏమిటని అన్నట్లు గుర్తు చేశారు. నేను అధికార పార్టీ ఎమ్మెల్యేనైనా గ్రామ ప్రజలకు వ్యతిరేకంగా పనులు చేయనని తెలిపారు. మైనింగ్‌ లీజుకు తీసుకున్న వ్యక్తి కోర్టుకు వెళ్లినా మనం కోర్టుకు వెళ్లి ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయిద్దామని, అందుకు అయ్యే ఖర్చును నేను భరిస్తానని హామీ ఇచ్చారు. పులిగుట్టపై రాజకీయలు చేయొద్దని, ముమ్మాటికి మీ వెంట ఉంటానని, ఇందులో ఎలాంటి అనుమానాలు వద్దన్నారు. సభలో ఆర్డీవో పద్మావతి, తహసీల్దార్‌ బాల్‌రెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు. అనంతరం కనిమెట్ట గ్రామానికి చేరుకొని బీఆర్‌ఎస్‌ కార్యకర్త చంద్రశేఖర్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా మంజూరైన రూ. 2 లక్షల ఇన్సూరెన్స్‌ చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు.

Updated Date - 2023-03-18T23:09:01+05:30 IST