ప్రజాధనానికి రక్షణ కల్పించాలి

ABN , First Publish Date - 2023-02-06T23:56:52+05:30 IST

దేశంలోని కోట్లాది మంది సామాన్యులు బ్యాంకుల్లో దాచుకున్న ధనానికి రక్షణ కల్పించాలని డీసీసీ అధ్యక్షుడు పటేల్‌ ప్రభాకర్‌ రెడ్డి కోరారు. అదాని గ్రూప్‌ కంపెనీ షేర్ల విలువ పడిపోవడంతో జాతీయ బ్యాంకులు నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం తలెత్తిందని ఆం దోళన వ్యక్తం చేశారు.

ప్రజాధనానికి రక్షణ కల్పించాలి
గద్వాల ఎస్‌బీఐ బ్రాంచి ముందు ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

- డీసీసీ అధ్యక్షుడు పటేల్‌ ప్రభాకర్‌ రెడ్డి

- ఎస్‌బీఐ బ్రాంచి ముందు ధర్నా

గద్వాల అర్బన్‌, ఫిబ్రవరి 6 : దేశంలోని కోట్లాది మంది సామాన్యులు బ్యాంకుల్లో దాచుకున్న ధనానికి రక్షణ కల్పించాలని డీసీసీ అధ్యక్షుడు పటేల్‌ ప్రభాకర్‌ రెడ్డి కోరారు. అదాని గ్రూప్‌ కంపెనీ షేర్ల విలువ పడిపోవడంతో జాతీయ బ్యాంకులు నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం తలెత్తిందని ఆం దోళన వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా సోమవారం పట్టణంలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రధాన బ్రాంచి ముందు పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా ఉండటం సిగ్గుచేటన్నారు. ఎనిమిదేళ్లలో 15 రెట్లు ఆస్తిని పెంచుకున్న ప్రధాని స్నేహి తుడు అదాని ఉదంతమే ఇందుకు నిదర్శన మన్నారు. దేశభక్తి, జాతీయత పేర్లతో ప్రజాధనాన్ని స్నేహితులకు కట్టబెడుతున్న మోదీ ప్రభుత్వం తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్నారు. ధర్నాలో టీపీసీసీ ప్రతినిధి, మాజీ మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ శంకర్‌, సీనియర్‌ నాయకులు బలిగెర నారాయణ రెడ్డి, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు ఇసాక్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అద్యక్షుడు గౌస్‌, మీడియా ఇన్‌చార్జి షేక్‌జమాల్‌, జిల్లా అధికార ప్రతినిధి నందు, యువజన కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఇలియాస్‌, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌, నాయకులు షాషా, మాజిద్‌, లక్ష్మణ్‌, అంబేడ్కర్‌, జహంగీర్‌, రాము, అజయ్‌, బీసన్న, వీరేష్‌ పాల్గొన్నారు.

ఆదిశిలా క్షేత్రంలో ప్రత్యేక పూజలు

మల్దకల్‌ : ఆదిశిలా క్షేత్రంలోని స్వయం భువు శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి, నాయకులు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు వారికి ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి, తీర్థ ప్రసాదాలను అందిం చారు. స్వామివారి జ్ఞాపికను అందించి సత్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నల్లారెడ్డి, నారాయణరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:56:52+05:30 IST