ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయం
ABN , First Publish Date - 2023-08-02T23:56:33+05:30 IST
అనారోగ్య కార ణాల వల్ల బాధపడుతున్న ప్రజలకు అత్య వసర సేవలందించేందుకు గాను ప్రభు త్వం రాష్ట్రవ్యాప్తంగా 466 అంబులెన్స్‌లను మంజూరు చేసిందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
అమరచింత, ఆగస్టు 2 : అనారోగ్య కార ణాల వల్ల బాధపడుతున్న ప్రజలకు అత్య వసర సేవలందించేందుకు గాను ప్రభు త్వం రాష్ట్రవ్యాప్తంగా 466 అంబులెన్స్‌లను మంజూరు చేసిందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం అమరచింత మండల కేంద్రంలోని దేశాయి మురళీధర్‌రెడ్డి ప్రభుత్వ ప్రాథమిక ఆసు పత్రికి మంజూరైన 108 అంబులెన్స్‌ను చి ట్టెం రామ్మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అత్యవసర సేవలను అందించేందుకు ఆసుపత్రి లో అంబులెన్స్ అందుబాటులో ఉంటుందని తెలి పారు. ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు గాను ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రత్యేక చికిత్సలు చేస్తా రని, ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులలో చేరి తమ తమ రోగాలను నయం చేసుకోవాలని కోరారు.
వాల్మీకి యాదవుల కమ్యూనిటీ భవనాల కోసం నిధులు మంజూరు
అమరచింత పట్టణంలోని మాజీ జడ్పీటీసీ సభ్యుడు రాజేందర్‌సింగ్ నివాస ఆవరణలో వాల్మీకి కమ్యూనిటీ భవనం కోసం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తు ప్రొసీడింగ్ కాపీని ఎమ్మెల్యే వాల్మీకులకు అందజేశారు. అలాగే, యా దవ కమిటీ భవన నిర్మాణం కోసం రూ.పది లక్ష లు మంజూరు చేశారు. మొదటి దఫాగా రూ.ఐదు లక్షల ప్రొసీడింగ్ కాపీని యాదవులకు అందజేశారు. కొంకనివానిపల్లి శివారులో బ్రిడ్జి నిర్మాణం కోసం అదనంగా రూ.ఐదు లక్షలు మం జూరు చేస్తు ప్రొసీడింగ్స్ కాపీని అందజేశారు. పట్టణంలోని వివిధ పార్టీలకు చెందిన సానుభూ తిపరులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కార్య క్రమంలో పురపాలక చైర్‌పర్సన్ వి.మంగ మ్మ, మార్కెట్ యార్డు చైర్మన్ ఎస్‌ఏ.రాజు, బీ ఆర్‌ఎస్ మండల అధ్య క్షుడు రమేష్, పట్టణ అధ్యక్షుడు నాగభూష ణంగౌడ్, కౌన్సిలర్లు, కా ర్యకర్తలు పాల్గొన్నారు.