పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవం
ABN , First Publish Date - 2023-02-09T23:07:20+05:30 IST
జిల్లా కేంద్రంలోని ఆదర్శ బీఈడీ కళాశాలలో పీఆర్టీ యూటీఎస్ 52వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం జెండాను ఆవిష్కరించారు.
నారాయణపేట టౌన్/ఊట్కూర్, ఫిబ్రవరి 9 : జిల్లా కేంద్రంలోని ఆదర్శ బీఈడీ కళాశాలలో పీఆర్టీ యూటీఎస్ 52వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం జెండాను ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి మాట్లాడారు. ఉద్యోగ సంఘాల సమస్యల సాధనలో పీఆర్టీయూ టీఎస్ ముందు ఉంటుంద న్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి చెన్నకేశవరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. సర్వీస్‌లో వచ్చే సమస్యలు, 317 జీవో ద్వారా వచ్చిన సమస్యలు, సీపీఎస్ రద్దు కోసం తమ సంఘం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో నాయకులు సంతోష్, సత్యనారాయణ, శ్రీనివాస్, సంతోష్, జహీరుద్దిన్, భాస్కర్, ప్రకాష్, నరేష్, అబ్దుల్ గఫూర్, అరవింద్, నర్సింగ్‌రావు, బాలాజీ, తిమ్మారెడ్డి, వెంకటప్ప, రవి, సుదర్శన్ పాల్గొన్నారు.
- ఊట్కూర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం పీఆర్టీయూ ఆవిర్భావ వేడుకలను ఆ సంఘం నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల శాఖ తరపున కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం పీఆర్టీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల పాలిట కల్పతరువుగా పీఆర్టీయూ ఆవిర్భవించిందన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమమే లక్ష్యంగా 52 సంవత్సరాల నుంచి పార్టీలకు అతీతంగా పని చేస్తోంద న్నారు. ఈ సుదార్ఘ పోరాటంలో ఉపాధ్యాయుల కోసం పోరాటం చేసి అనేక జీవోలను తీసుకొచ్చిందన్నారు. సంఘం వ్యవస్థాపకుడు సామాల యాదగిరికి సంఘం సభ్యులు ఎప్పుడు రుణపడి ఉంటారన్నారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి భాస్కర్, నాయకులు శేఖర్‌రెడ్డి, రవికుమార్, అంబర్‌నాథ్, ఆంజనేయులు, గోవర్ధన్, సత్యపాల్, చంద్రకళ, శశిరేఖ, జయశ్రీ, గురునాథ్, అబ్దుల్ గఫార్, ఫజల్, రహెమాన్, అశోక్‌బాబు తదితరులు పాల్గొన్నారు.