టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్‌పై నిరసన
ABN , First Publish Date - 2023-03-19T22:53:48+05:30 IST
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్‌లపై కాంగ్రెస్ నాయకులు కల్వకుర్తిలో ఆదివారం నిరసన వ్యక్తం చేశారు.

- కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం, మంత్రి దిష్టిబొమ్మల దహనం
కల్వకుర్తి, మార్చి 19 : టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్‌లపై కాంగ్రెస్ నాయకులు కల్వకుర్తిలో ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాయితీ విజయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌ను సస్పెండ్ చేయాలని, పరీక్షలు రాసిన నిరుద్యోగులందరికీ రూ.లక్ష చెల్లించా లని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చిమ్ముల శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మిరియాల శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పి.శేఖర్, దామోదర్‌రెడ్డి, శంకర్‌నాయక్, ఆంజనేయులుయాదవ్, శ్రీధర్‌రెడ్డి, గోపాల్, సైదులు యాదవ్, నాని, దాస్యనాయక్, కిరణ్, అనిల్, గణేష్, ఎండి.ఆరీఫ్, మాలిక్ తదితరులున్నారు.
- కొల్లాపూర్ : నవీన్‌కుమార్ ఆత్మహత్యకు నిరసనగా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపు మేరకు కొల్లాపూర్‌లో కాంగ్రెస్ నాయకులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆదివారం పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో దిష్టిబొమ్మల దహనం కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రాముయాదవ్ మాట్లాడుతూ సిరిసిల్లలో నిరుద్యోగ యువకుడు నవీన్‌కుమార్‌ది ఆత్మహత్య కాదని ప్రభుత్వ హత్య అని పేర్కొన్నారు. నవీన్‌కుమార్ కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మీనుగ పరుశరామ్‌నాయుడు, నాయకులు జంగం శివానందం, నగర అధ్యక్షుడు కాంతారావు, కుర్మయ్య, వెంకటస్వామి తదితరులున్నారు.
- కోడేరు : టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్‌కు నిరసనగా కాంగ్రెస్ నాయకులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల దిష్టిబొమ్మలను ఆదివారం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహం ముందు దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పుట్ట రాముడు మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చామంతి రాజు, మీసేవ అశోక్, విష్ణు తదితరులున్నారు.
- పెద్దకొత్తపల్లి : సిరిసిల్లకు చెందిన నవీన్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల దిష్టిబొమ్మలను వారు దహనం చేశారు. నిరుద్యోగులు మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకోవద్దని, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వారు భరోసానిచ్చారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు ఖాజా, కాంగ్రెస్ నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, శ్రీను, బత్తుల కుర్మయ్య, రామస్వామి, వెంకటస్వామి, మురళిధర్‌రెడ్డి, ఇక్బాల్, నాగబాబు, సాయిబాబు తదితరులున్నారు.
- వెల్దండ : టీఎస్‌పీఎస్సీలో జరిగిన పేపర్ లీక్‌ను నిరసిస్తూ టీపీసీసీ పిలుపుమేరకు ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మండలకేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన రహదారిపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను నాయకులు దహనం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మోతీలాల్‌నాయక్, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటయ్యగౌడ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శేఖర్, నాయకులు చంద్రమోహన్‌రెడ్డి, పుల్లయ్య, మధుసూదన్‌రెడ్డి, శ్రీనుయాదవ్, తిరుపతిరెడ్డి, తావ్ర్యునాయక్, రమేష్, శ్రీను, భరత్‌గౌడ్, రాంరెడ్డి తదితరులున్నారు.