రాహుల్‌గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై నిరసన

ABN , First Publish Date - 2023-03-25T23:47:41+05:30 IST

ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎంపీ సభ్యత్వంపై అనర్హత వేటు ను నిరసిస్తూ శనివారం మండలంలోని మల్లాయి పల్లిలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి రంగినేని అభి లాష్‌రావు ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

రాహుల్‌గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై నిరసన
మల్లాయిపల్లిలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న రంగినేని అభిలాష్‌రావు

- ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం

పాన్‌గల్‌, మార్చి 25 : ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎంపీ సభ్యత్వంపై అనర్హత వేటు ను నిరసిస్తూ శనివారం మండలంలోని మల్లాయి పల్లిలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి రంగినేని అభి లాష్‌రావు ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్‌ గాంఽధీపై అనర్హత వేటు వేయడం పార్లమెంటు చరిత్రలో చీకటి దిన మని అన్నారు. రాహుల్‌గాంధీ ఇటీవల 4,000 కిలోమీటర్లు భారత్‌ జోడో యాత్ర పూర్తి చేసు కొని పార్లమెంటులో అడుగుపెట్టి అదాని మోదీల విదేశీ పర్యటనపై ప్రజలకు తెలియజేస్తే అధికా రం మదంతో రాజకీయ కుట్ర చేసి కేసులు వేయ డం సిగ్గుచేటన్నారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన కేసులు వేసిన రాహుల్‌గాంధీ వెనకడుగు వేయరని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మహి ళా అధ్యక్షురాలు శ్రీలతారెడ్డి, రాష్ట్ర సోషల్‌ మీడి యా కార్యదర్శి పరమేష్‌, తాలుకాయూత్‌ కాం గ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జిల్లా సేవాదళ్‌ ఉపాధ్య క్షుడు ప్రవీణ్‌, రాజు, మధు, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

-ఆత్మకూర్‌ : రాహుల్‌గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై ప్రధాని మోదీ దిష్టిబొమ్మను స్థానిక గాంధీచౌరస్తాలో దహనం చేశారు. కార్యక్ర మంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పర మేష్‌, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసులు, నాయ కులు రహమతుల్లా, మక్తల్‌ నియోజకవర్గ యూ త్‌ అధ్యక్షుడు తులసిరాజ్‌, జబ్బార్‌, భగవంతు, బుచ్చన్న, మధు, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పా ల్గొన్నారు.

అనర్హత వేటు అప్రజాస్వామికం

మదనాపురం : బీజేపీ ప్రభుత్వం రాహుల్‌ గాంఽధీపై అనర్హత వేటు వేయడం అప్రజాస్వామి కమని, ప్రజాస్వామ్యంలో ఇది చీకటిరోజని కాం గ్రెస్‌ పార్టీ కిసాన్‌ సెల్‌ జిల్లా అద్యక్షుడు వేముల శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం మండల కేం ద్రంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. సమా వేశంలో వడ్డెకృష్ణ, రాములు, నాగన్న, బాలకిష్టన్న, శేషన్న, రవీందర్‌రెడ్డి, శ్రీనివాసులు ఉన్నారు.

Updated Date - 2023-03-25T23:47:41+05:30 IST