ప్రధాని మోదీ పాలన ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యాయం

ABN , First Publish Date - 2023-03-25T23:49:31+05:30 IST

నియంతృత్వ విధానాలతో దేశంలో ప్రధాని నరేంద్రమోదీ పాలన సాగిస్తున్నారని, ఆయన పాలన ప్రజా స్వామ్యంలో చీకటి అధ్యాయమని డీసీసీ అధ్యక్షుడు జి.మధుసూదన్‌రెడ్డి విమర్శించారు.

ప్రధాని మోదీ పాలన ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యాయం
మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు జి. మధుసూదన్‌రెడ్డి

- విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): నియంతృత్వ విధానాలతో దేశంలో ప్రధాని నరేంద్రమోదీ పాలన సాగిస్తున్నారని, ఆయన పాలన ప్రజా స్వామ్యంలో చీకటి అధ్యాయమని డీసీసీ అధ్యక్షుడు జి.మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. శనివారం డీసీసీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావే శంలో ఆయన మాట్లాడారు. అణచివేత మోదీ ఎంచుకున్న మార్గమని, అది దేశాన్ని తిరోగమనంలోకి తీసుకెళుతోందని అన్నారు. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై అనర్హత వేటు మోదీ నియంతృత్వానికి పరాకాష్ట అని, ఈ ఘటనతో మోదీ నిజస్వరూపం బయటపడిందని పేర్కొన్నారు. రాజ కీయ నాయకులు మాట్లాడే మాటలు, చేసేవ్యాఖ్యలపై పారదర్శకంగా విచా రణ చేస్తే బీజేపీ సభ్యులెందరో పదవులు కోల్పోతారని పేర్కొన్నారు. ప్రపంచ చరిత్రలో నియంతలెవరూ మనుగడ సాగించలేదని, కాలగర్భంలో కొట్టుకు పోయారని హెచ్చరించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ సైతం ప్రధాని మోదీ తరహాలోనే నియంతృత్వ విధానాలు అవలంభిస్తూ ప్రజల్ని గాలికివదిలేశారని దుయ్యబట్టారు. ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలపై సిట్టింగ్‌ జడ్జిచే విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 27 సోమవారం జిల్లా కేంద్రంలో టీఎస్‌పీఎస్సీ లీకేజీ ఘటనలు, రాహుల్‌గాంధీపై అనర్హత వేటుక నిరసనగా నిరసన దీక్షలు చేపడతామని వెల్లడించారు. ప్రజాస్వామికవాదులంతా దీక్షల్లో పాల్గొనాలని కోరారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్‌ ముదిరాజ్‌, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వసంత, సిరాజ్‌ఖాద్రి, లక్ష్మణ్‌యాదవ్‌, బెనహర్‌, సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగడతాం

చిన్నచింతకుంట : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానలను ప్రజల్లో ఎండగట్టేందుకు హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర చేపడుతున్నామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు. శనివారం మండలంలోని అల్లిపూరం గ్రామంలో హాత్‌ సే హాత్‌ జోడో యాత్రలో భాగం గా ఆయన గ్రామస్థులను ఉద్దేశించి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌వైపు ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో, బీడీ కార్మికులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకులు వేణుగోపాల్‌, శ్రీనివాసులు, మైమూద్‌, ప్రతాప్‌, నాయకులు, కార్యక్తలు పాల్గొన్నారు.

మోదీ దిష్టి బొమ్మ దహనం

బాదేపల్లి : రాహులు గాంధీపై అనర్హతవేటు వేసి ఇబ్బందులకు గురిచేయ డాన్ని నిరసిస్తూ శనివారం జడ్చర్ల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని సిగ్నల్‌గడ్డ అంబేడ్కర్‌ చౌరస్తాలో ప్రధాన మంత్రి మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:49:31+05:30 IST