‘ప్రజాపాలన’ విజయవంతం చేయాలి
ABN , Publish Date - Dec 26 , 2023 | 10:32 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలని అదనపు కలెక్టర్లు అపూర్వ చౌహాన్, చీర్ల శ్రీనివాస్‌లు అధికారులకు ఆదేశించారు.
- ఈ నెల 28 నుంచి వచ్చే నెల ఆరు వరకు నిర్వహణ
- అదనపు కలెక్టర్లు అపూర్వచౌహాన్, చీర్ల శ్రీనివాస్
- అధికారులతో సమీక్ష
గద్వాల న్యూటౌన్, డిసెంబరు 26 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలని అదనపు కలెక్టర్లు అపూర్వ చౌహాన్, చీర్ల శ్రీనివాస్‌లు అధికారులకు ఆదేశించారు. కార్యక్రమం అమలుపై జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సము దాయం సమావేశపు హాలులో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్ మాట్లాడుతూ ఈనెల 28 నుంచి జనవరి ఆరవ తేదీ వరకు నిర్వహించనున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజల చెంతకు తీసుకువెళ్లేందుకు పక్కా ప్రణాళికను రూపొందించాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా చర్యలు తీసుకోవాని అధికారులకు సూచించారు. మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. గ్రామసభ నిర్వహణపై డప్పు చాటింపు వేయాలని సూచించారు. దరఖాస్తుదారుడికి రసీదు అందించాలని, ప్రతీ గ్రామ పంచాయతీ, మునిసిపల్ వార్డుల్లో ప్రజాపాలన సభల నిర్వహణకు ఇన్‌చార్జీలను ఏర్పాటు చేయాలని చెప్పారు. గ్రామ సభల్లో ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలి, ఎవరు విధులు నిర్వర్తించాలి తదితరాలన్నీ ప్రణాళికబద్ధంగా జరిగేలా చూడాలని, సిబ్బందికి ముందస్తుగా విధులు అప్పగిస్తూ ప్రొసీడింగ్స్ జారీ చేయాలని అఽధికారులను ఆదేశించారు. ప్రతీ వంద కుటుంబాలకు ఒక కౌంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. చిన్న గ్రామ పంచాయతీల్లో ఉద యం, పెద్ద పంచాయతీల్లో ఉదయం, మధ్యాహ్నం సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దర ఖాస్తులను ప్రభుత్వమే ప్రజలకు అందిస్తుందని, ప్రజాపాలనపై ప్రతీ గ్రామంలో, మునిసిపాలిటీల్లోని వార్డుల్లో విస్తృత ప్రచారం చేయాలని, ఒకరోజు ముందుగా టామ్‌టామ్ చేయించాలని ఆదేశించారు. గ్రామసభలు జరిగే ప్రాంతంలో హెల్త్‌క్యాంపులు, తాగునీరు. టెంట్లు, కౌంటర్ల కోసం టేబుళ్లు, స్టేషనరీ, బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైతే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎన్.రవి, ఎస్‌డీసీ సుబ్రహ్మణ్యం, జడ్పీ సీఈవో కాంతమ్మ, అఽధికారులు పాల్గొన్నారు.