సమర్థవంతంగా విధులు నిర్వహించాలి

ABN , First Publish Date - 2023-03-25T23:23:26+05:30 IST

కోర్డు డ్యూటీ ఆఫీసర్లు, వర్టికల్‌ సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఎస్‌ఐ శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు.

సమర్థవంతంగా విధులు నిర్వహించాలి
శిక్షణలో మాట్లాడుతున్న ఊట్కూరు ఇన్‌చార్జి ఎస్‌ఐ అప్జల్‌

నారాయణపేట/మాగనూరు/ఊట్కూరు, మార్చి 25 : కోర్డు డ్యూటీ ఆఫీసర్లు, వర్టికల్‌ సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఎస్‌ఐ శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని కోర్టు డ్యూటీ ఆఫీసర్లు, వర్టికల్‌ సిబ్బందికి శనివారం ఎస్‌హెచ్‌వోల ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ కేసుల దర్యాప్తు, ప్రాసిక్యూషన్‌, విచారణ సమయంలో కోర్టు డ్యూటీ ఆఫీసర్లు సమర్థవంతంగా విచారణ చేపట్టాలన్నారు. అదే విధంగా ప్రాసిక్యూషన్‌, సమన్స్‌ డ్యూటీ ఆఫీసర్‌, వారంట్‌ డ్యూటీ ఆఫీసర్స్‌ మరియు కోర్టులోని వివిధ అధికారులను సమన్వయ పరుస్తూ సాక్షులు, నిందితులు కోర్టులో హాజరై, కేసుల విచారణ త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. ఎఫ్‌ఐఆర్‌ కాపీని ఆలస్యం చేయకుండా కోర్టులో అందజేయాలని, కేసు పురోగతి నివేదికలను పార్ట్‌ 2 స్టేట్‌మెంట్‌ని, సీజ్‌ చేసిన వస్తువులను ఎప్పటికప్పుడు కోర్టుకు సమర్పించాలని సూచించారు. కోర్టు జారీ చేసే నాన్‌ బేయిల్‌ వరింట్లను క్రమం తప్పకుండా తీసుకోవాలని, ప్రతీరోజు కోర్టు నుంచి తీసుకునే సమన్లు రిజిస్టర్‌లో నమోదు చేసి, సమన్స్‌ ఆఫీసర్లకు అందించాలన్నారు. ప్రతీ శనివారం కోర్టులో కేసులలో పడిన శిక్షలపై చర్చించుకోవాలని సూచించారు. అదే విధంగా మాగనూరులో ఎస్‌ఐ నరేందర్‌, ఊట్కూరులో ఇన్‌చార్జి ఎస్‌ఐ అప్జల్‌ ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగింది.

కొనసాగిన వీక్లీ పరేడ్‌..

ఎస్పీ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని పరేడ్‌ మైదానంలో ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీసులు, సర్కిల్‌ పోలీసులకు వీక్లీ పరేడ్‌ కొనసాగింది. ఈ సందర్భంగా ఆర్‌ఐ డేవిడ్‌ విజయ్‌ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు విధులు నిర్వహించే సమయంలో అప్రమత్తంగా ఉండి, ప్రజల మన్ననలు పొందాలన్నారు. పరేడ్‌ వల్ల శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని, ప్రతీరోజు నిర్వహించే విధుల గురించి తెలుసుకోవడంతో పాటు ఆయుధాల వినియోగంపై అవగాహన కలుగుతోందన్నారు. ఎస్‌ఐ శ్రీనివాస్‌రావు, ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:23:26+05:30 IST