పెండింగ్‌ పనులను పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2023-08-02T23:42:02+05:30 IST

క్యాంపు కార్యాలయం, ఎస్పీ రెసిడెన్సీ, సాయుధ దళ కార్యాలయాలకు సంబంధించిన పెండింగ్‌ పనులను ఈ నెల చివరివరకు పూర్తి చేయాలని ఎస్పీ సృజన పోలీస్‌ హౌసింగ్‌ ఏఈని ఆదేశించారు.

పెండింగ్‌ పనులను పూర్తి చేయాలి
మ్యాప్‌ను పరిశీలిస్తున్న ఎస్పీ సృజన

- ఎస్పీ సృజన

- కార్యాలయ నిర్మాణ పనుల పరిశీలన

గద్వాల క్రైం, ఆగస్టు 2 : క్యాంపు కార్యాలయం, ఎస్పీ రెసిడెన్సీ, సాయుధ దళ కార్యాలయాలకు సంబంధించిన పెండింగ్‌ పనులను ఈ నెల చివరివరకు పూర్తి చేయాలని ఎస్పీ సృజన పోలీస్‌ హౌసింగ్‌ ఏఈని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పీజేపీ క్యాంపు వద్ద నిర్మిస్తున్న పోలీస్‌ శాఖ క్యాంపు కార్యాలయం, ఎస్పీ రెసిడెన్సీ, సాయుధ దళ కార్యాలయాలను బుధవారం ఆమె పరిశీలించారు. క్యాంపు ఆఫీస్‌కు, రెసిడెన్సీకి రోడ్డు నిర్మించే ప్రదేశం, గార్డ్‌ రూమ్‌ ఏర్పాటు చేయనున్న స్థలానికి సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించారు. పరేడ్‌ మైదానంలో నిర్మిస్తున్న వేదిక పనులను తనిఖీ చేశారు. పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీ రవి, సాయుధ దళ డీఎస్పీ ఇమ్మానియేల్‌. ఆర్‌ఐ వెంకట్‌ ఉన్నారు.

Updated Date - 2023-08-02T23:42:02+05:30 IST