పెండింగ్‌ రిజిస్ట్రేషన్‌లను త్వరగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2023-03-02T23:51:59+05:30 IST

ధరణి పోస్టల్‌లో రిజిస్ట్రేషన్లు వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ జి. రవి నాయక్‌ అన్నారు.

పెండింగ్‌ రిజిస్ట్రేషన్‌లను త్వరగా పూర్తి చేయాలి
రాజాపూర్‌ ఎంపీడీవో కార్యాలయం పరిశీలనలో కలెక్టర్‌ రవి నాయక్‌

- ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచాలి

- ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేయించాలి

- బాలానగర్‌, రాజాపూర్‌లలో కలెక్టర్‌ జి. రవి పర్యటన

బాలానగర్‌/ రాజాపూర్‌, మార్చి 2 : ధరణి పోస్టల్‌లో రిజిస్ట్రేషన్లు వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ జి. రవి నాయక్‌ అన్నారు. గురువారం తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాలను ఆకస్మికం గా తనిఖీ చేశారు. రికార్డు గదిలోకి వర్షం నీరు వస్తే రికార్డులు తడిసిపో తాయని, తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ధరణి పోర్టల్‌లో ఎన్ని రిజిస్ట్రేషన్లు పెంగింగ్‌లో ఉన్నాయని తహసీల్దార్‌ శ్రీనివా స్‌ను అడగడంతో గడచిన రెండున్నర సంవత్సరాల నుంచి 230 రిజిస్త్రేష న్లు పెండింగ్‌లో ఉన్నాయని, క్రయవిక్రయదారులు దరఖాస్తు చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్లకు రానందున పెండింగులో ఉన్నట్లు తెలిపారు. ఉపా ధి హామీ పథకం కింద పనిదినాల సంఖ్యను పెంచాలని ఎంపీడీవోకు సూచించారు. విద్యార్థుల ఉపకార వేతనాల విషయమై మాట్లాడుతూ బ్యాంక్‌ ఖాతాలు తెరిచేందుకుగాను మేనేజర్ల సహకారం తీసుకోవాలని స్పెషల్‌ ఆఫీసర్‌కు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీవో కృష్ణారావు, సిబ్బంది పాల్గొన్నారు.

కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

రాజాపూర్‌ తహసీల్దార్‌, మండల పరిషత్‌ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలను గురువారం కలెక్టర్‌ జి. రవి నాయక్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ ద్వారా జరుగుతున్న భూముల క్రయవిక్రయాల, రిజిష్ర్టేషన్‌ల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయంలో జరుగుతున్న పనుల గురించి అధికారులతో మాట్లాడా రు. అక్కడే ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యా ర్థులతో ముచ్చటించారు. పదవ తరగతిలో అంద రు 100 శాతం ఉతీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్ర మంలో తహసీల్దార్‌ రాంబాయ్‌, ఎంపీడీవో లక్ష్మీదేవి, ఎంపీవో రాములు, రెవెన్యూ సిబ్బంది, మండల పరిషత్‌ సిబ్బంది ఉన్నారు.

కల్యాణలక్ష్మి, షాదీముబార్‌ చెక్కులు వారంలోపు జారీ చేయాలి

మహబూబ్‌నగర్‌ టౌన్‌ : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథ కం కింద బడ్జెట్‌ మంజూరై లబ్ధిదారుల ఎంపిక సైతం జరిగిన చోట బ్యాంకుల ద్వారా అందించే డీడీలు, చెక్కులను వారంలోపు ఇవ్వాలని కలెక్టర్‌ జి. రవి నాయక్‌ ఆదేశించారు. గురువారం ఆ యన తహసీల్దార్‌లు, రెవెన్యూ అధికారులతో పలు రెవెన్యూ అంశాలపై తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఇసుక జరిమానాలపై మాట్లాడుతూ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ఆదేశించారు. కల్యాణలక్ష్మి, షాదీముబార్‌ కింద దరఖాస్తులు ఎక్కువ రోజులు పెండింగ్‌ లేకుండా చూసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉపకార వేతనాల మంజూరుకై ఆయా బ్యాంకుల అధికారులతో సమన్వయం చేసుకొని బ్యాంకు ఖాతా ప్రారంభించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కులం, ఆదాయ ధ్రువపత్రాలను తహసీల్దార్లు 24 గంటల్లో జారీచేసే విధంగా చూడాలన్నారు. అర్బన్‌ హౌసింగ్‌లో లబ్దిదారుల వివరాలను అప్లోడ్‌ చేసే విషయం మంచి పురోగతి ఉందని, అలాగే తక్కిన వివరాలను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోరారు. తహసీల్దార్లు, రెవెన్యూ అంశాలపై మరింత దృష్టి కేంద్రీక రించి పని చేయాలన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్‌ సీతారామారావు, స్పెషల్‌ కలెక్టర్‌ పద్మశ్రీ, హౌసింగ్‌ ఈఈ వైద్యం భాస్కర్‌, ఏడి మైన్స్‌ విజయకుమార్‌, ఎల్‌డీఎం.కే భాస్కర్‌ తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.

Updated Date - 2023-03-02T23:51:59+05:30 IST