అవసరమైతే నేరస్థులపై పీడీ చట్టం

ABN , First Publish Date - 2023-02-04T23:03:01+05:30 IST

శాంతిభద్రతల నిర్వహణలో పోలీసులు సమర్థవంతంగా పనిచేయాలని, అవసరమైతే నేరస్థులపై పీడీ చట్టం నమోదుకు చర్యలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్‌ తెలిపారు.

అవసరమైతే నేరస్థులపై పీడీ చట్టం

పోలీసు అధికారులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్‌

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 4 : శాంతిభద్రతల నిర్వహణలో పోలీసులు సమర్థవంతంగా పనిచేయాలని, అవసరమైతే నేరస్థులపై పీడీ చట్టం నమోదుకు చర్యలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్‌ తెలిపారు. శనివారం ఆయన హైకోర్టు స్పెషల్‌ జీపీ ముజీబ్‌తో కలిసి ఉమ్మడి పాలమూరు జిల్లాల ఎస్పీలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫంక్షనల్‌ వర్టికల్‌ను ఖచ్చితంగా అమలు చేయాలని, కేసుల విచారణలో పురోగతి సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా హైకోర్టు జీపీ న్యాయపరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జోగుళాంబ జోన్‌ డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌, మహబూబ్‌నగర్‌ ఎస్పీ కె నరసింహ, నారాయణపేట ఎస్పీ ఎన్‌ వెంకటేశ్వర్లు, నాగర్‌కర్నూల్‌ ఎస్పీ మనోహర్‌, గద్వాల ఎస్పీ సృజన తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-04T23:03:03+05:30 IST