పార్లమెంటు భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలి

ABN , First Publish Date - 2023-05-02T22:50:47+05:30 IST

నూతనంగా నిర్మాణంలో ఉన్న పార్లమెంటు భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

పార్లమెంటు భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలి
రాచూరులో బీరప్ప పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

- ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

వెల్దండ, మే 2 : నూతనంగా నిర్మాణంలో ఉన్న పార్లమెంటు భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం మండల పరిధిలోని రాచూరు గ్రామంలో నిర్వహించిన బీరప్ప పండుగలో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. దేశం గర్వపడేలా కొత్త సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టడం జరిగిందన్నారు. జిల్లాలోని పాలమూరు-రంగారెడ్డి, డీఎల్‌ఐ ప్రాజెక్టుల పనులపై నూతన సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమీక్షించడం జరిగిందన్నారు. ఇక యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని పథకాలు అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని, ప్రజలు బీఆర్‌ఎస్‌వైపే ఉన్నారని జైపాల్‌యాదవ్‌ అన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భూపతిరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు గుత్తివెంకటయ్య, సర్పంచ్‌ జయమ్మ, మాజీ వైస్‌ ఎంపీపీ వెంకటయ్యగౌడ్‌ తదితరులున్నారు.

Updated Date - 2023-05-02T22:50:47+05:30 IST