సమాంతరంగా సంక్షేమం, అభివృద్ధి

ABN , First Publish Date - 2023-09-21T22:56:34+05:30 IST

రాష్ట్రంలో సమాంతరంగా సంక్షేమం, అభి వృద్ధి చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నా రు.

సమాంతరంగా సంక్షేమం, అభివృద్ధి
మణిగిళ్లలో మంత్రి చేతుల మీదుగా కల్యాణలక్ష్మి చెక్కులను అందుకుంటున్న లబ్ధిదారులు

- కేసీఆర్‌ నాయకత్వంలో దేశంలో అగ్రస్థానంలో తెలంగాణ

- వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

వనపర్తి అర్బన్‌/పెద్దమందడి, సెప్టెంబరు 21 : రాష్ట్రంలో సమాంతరంగా సంక్షేమం, అభి వృద్ధి చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నా రు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో 106 మంది లబ్ధిదారులకు రూ.42.50 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం వారితో సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్‌ కిట్‌, కళ్యాణలక్ష్మి, అమ్మఒడి, న్యూట్రిషన్‌ కిట్‌, ఆసరా పింఛన్లలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. సంక్షేమ గురుకుల పాఠశాలలతో విద్యారంగ స్వరూపం మారిందన్నారు. తెలంగాణ లో ప్రతి గడపకూ సంక్షేమం, ప్రతి గ్రామంలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, కౌన్సిల ర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు తదితరులున్నారు.

క్రీడల్లో గెలుపోటములు సహజం

వనపర్తి రూరల్‌ : క్రీడల్లో గెలుపోటములను సహజంగా తీసుకోవాలని వ్యవసాయ శాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి మండలంలోని చిట్యాల మహాత్మా జ్యోతి బాపూలేలో ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడల పోటీ లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరానికి అన్ని సంక్షేమ గురుకుల పాఠశాలల్లో సమస్యలు పరి ష్కారమవుతాయని అన్నారు. అన్ని గురుకుల పాఠశాలల సొంత భవనాల నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. విద్యార్థుల విద్యా సమస్యలు తెలు సుకుని పరిష్కరిస్తానని అన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, సర్పం చ్‌ భానుప్రకాష్‌రావు తదితరులున్నారు.

ఎల్‌వోసీలతో బాధితులకు భరోసా

మదనాపురం : ఎల్‌వోసీలతో బాధితులకు భ రోసా లభిస్తుందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని దుప్పల్లి గ్రామానికి చెం దిన దొడ్ల సరోజ నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొం దుతోంది. చికిత్స నిమిత్తం రూ.లక్ష విలువ గల ఎల్‌వోసీని బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి గురువారం అందజేశారు. కా ర్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రావణ్‌కు మార్‌రెడ్డి, సర్పంచ్‌ శివశంకర్‌, రాము పాల్గొన్నారు.

Updated Date - 2023-09-21T22:56:34+05:30 IST