Share News

నెట్టెంపాడు కాల్వకు గండి

ABN , Publish Date - Dec 31 , 2023 | 10:47 PM

జోగుళాంబ గద్వాల జిల్లాలోని నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగమైన 107 ప్యాకేజీ కాలువకు ఆదివారం అర్ధరాత్రి గండి పడి, నీరంతా వృథాగా పోయింది.

నెట్టెంపాడు కాల్వకు గండి
మల్లంపల్లి శివారులో కాల్వకు గండి పడి వృథాగా పోతున్న నీరు

ఆదివారం అర్ధరాత్రి తెగిన 107 ప్యాకేజీ కెనాల్‌

నీరు పారి పంట పొలాలకు నష్టం

గటు, డిసెంబరు 31: జోగుళాంబ గద్వాల జిల్లాలోని నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగమైన 107 ప్యాకేజీ కాలువకు ఆదివారం అర్ధరాత్రి గండి పడి, నీరంతా వృథాగా పోయింది. మల్లంపల్లి శివారులో బల్గెర దగ్గర గల ఈ కాల్వ ద్వారా బల్గెర, ఇందువాసి, ఛమాన్‌ఖాన్‌దొడ్డి తదితర గ్రామాల రైతుల పొలాలకు నీరు పారుతోంది. కాల్వకు గండి పడటంతో కాల్వ కింద ఉన్న పంట పొలాలు కోతకు గురై, నష్టం వాటిల్లిందని రైతులు చెప్పారు. కాల్వకు గండి పడిన విషయం అధికారులకు ఆదివారం ఉదయం తెలియడంతో కాలువకు నీటి సరఫరాను నిలిపేశారు. నీరు ఓవర్‌ ఫ్లో కావడం వల్ల గండి పడిందని రైతులు చెబుతున్నారు. నీరు ఓవర్‌ ఫ్లో కావడం వల్ల గండి పడిందా? లేక నాణ్యత లోపంతోనా? లేదంటే ఇందువాసి గ్రామానికి నీటిని తీసుకెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాల వల్ల గండి పడిందా? అన్నది అధికారులు తేల్చాల్సి ఉన్నది. ప్రస్తుతం పంటలకు సాగునీరు ఇస్తున్న క్రమంలో కాలువకు గండి పడటంతో రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఇరిగేషన్‌ ఈఈ వేంకటేశ్వర్‌రావును ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా.. గండి పడిన విషయం తెలియగానే నీటి సరఫరాను తగ్గించామని చెప్పారు. డీ-6 నుంచి 107 ప్యాకేజీ కాలువకు నీటిని మళ్లించడం వల్ల నీటి ప్లోటింగ్‌ పెరిగి, కాలువకు గండి పడినట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. గండి పడిన చోట మరమ్మతులు చేస్తామని చెప్పారు.

Updated Date - Dec 31 , 2023 | 10:47 PM