అందరికీ అర్థమయ్యేలా రామాయణాన్ని రచించిన మొల్ల

ABN , First Publish Date - 2023-03-13T23:32:13+05:30 IST

పండితులకే కాకుండా పామరులకు అర్థమయ్యే రీతిలో రామాయణాన్ని రచించి ప్రజలకు అందజేసిన కవయిత్రి ‘‘మొల్ల మాంబ’’ గొప్ప దార్శనికురాలని తెలంగాణ కుమ్మర సంఘం జిల్లా అధ్యక్షులు బుగ్గన్న, ఉపాధ్యక్షుడు టీకే మల్లేష్‌ అన్నారు.

అందరికీ అర్థమయ్యేలా రామాయణాన్ని రచించిన మొల్ల
కవయిత్రి మొల్ల జయంతి నిర్వహిస్తున్న శాలివాహనులు

- మొల్ల జయంతిలో కుమ్మర సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గన్న

పాలమూరు, మార్చి 13 : పండితులకే కాకుండా పామరులకు అర్థమయ్యే రీతిలో రామాయణాన్ని రచించి ప్రజలకు అందజేసిన కవయిత్రి ‘‘మొల్ల మాంబ’’ గొప్ప దార్శనికురాలని తెలంగాణ కుమ్మర సంఘం జిల్లా అధ్యక్షులు బుగ్గన్న, ఉపాధ్యక్షుడు టీకే మల్లేష్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మొల్ల జయంతిని ఘనంగా నిర్వహించారు. అనంతరం రెడ్‌క్రాస్‌ భవనంలో రక్తదానం చేశారు. ఏనుగొండ అనాథ శరణాలయంలో బాలలకు పండ్లు పంపిణీ చేశారు. పలువురు మాట్లాడుతూ రామాయణాన్ని సరళంగా రచించి శ్రీకృష్ణదేవరాయల మన్ననలు పొందిన కవయిత్రి మొల్ల నేటి తరానికి ఆదర్శమన్నారు. ఆమె కుమ్మర (శాలివాహన) కులంలో పుట్టటం అదృష్టంగా భావిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు రామచంద్రయ్య, కార్యదర్శి ఎల్లప్ప, కోశాధికారి రవిశంకర్‌, కె.నాగన్న, అశోక్‌, రవికుమార్‌, బాలచందర్‌, ఆంజనేయులు, వెంకటయ్య, మాసయ్య పాల్గొన్నారు.

చరిత్ర సృష్టించిన మహనీయురాలు మొల్లమాంబ : ఎమ్మెల్యే

బాదేపల్లి : మొదటి మహిళ కవయిత్రి మొల్లమాంబ స్వయంగా చదువు నేర్చుకొని కలం పట్టి కవిత్వం రాసి చరిత్ర సృష్టించారని ఎమ్మెల్యే సి. లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో అంబేడ్కర్‌ విగ్రహం ముందు మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ దోరేపల్లి లక్ష్మి, జడ్పీవైస్‌ చైర్మన్‌ యాదయ్య, నాయకులు మురళి, రాజు, లత, ఎల్లప్ప, ఆనంద్‌, రవిశంకర్‌, బాలరాజు, శివదర్శన్‌, రమేష్‌, రవితేజ, నాయకులు పాల్గొన్నారు

ఫ హన్వాడ : మండల కేంద్రంలో సోమవారం కవయిత్రి మొల్లమాంబ జయంతిని కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికి విచ్చేసిన ముడా డైరెక్టర్‌ కొండ బాలయ్య, బీఆర్‌ఎస్‌ నాయకులు దాసరి పెంటయ్య హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో కుమ్మరి సంఘం మండల అధ్యక్షుడు అచ్చన్న, నాయకులు వెంకటయ్య, శ్రీను పాల్గొన్నారు.

ఫ దేవరకద్ర : మండల కేంద్రంలోని కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో మొల్లమాంబ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. పోచమ్మ దేవాలయం దగ్గర ఆమె చిత్రపటానికి పూలమాలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం అధ్యక్షుడు బుచ్చన్న, నాయకులు నారాయణ, నరేష్‌, మోహన్‌, రాములు నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-13T23:32:13+05:30 IST