దేశంలో ప్రమాదకరమైన వ్యక్తి మోదీ

ABN , First Publish Date - 2023-09-04T23:03:57+05:30 IST

దేశంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.

దేశంలో ప్రమాదకరమైన వ్యక్తి మోదీ
జిల్లా కేంద్రంలో లింగారెడ్డి స్మారక స్తూపాన్ని ఆవిష్కరిస్తున్న కూనంనేని సాంబశివరావు

- జమిలీ ఎన్నికల క్రీడలో ప్రజాస్వామ్యం బలి

- బీఆర్‌ఎస్‌, బీజేపీలను ఓడించేందుకు కలిసొచ్చే పార్టీలతో కలిసి పనిచేస్తాం

- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, సెప్టెంబరు 4 : దేశంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. జమిలీ ఎన్నికల పేరు తో రాజకీయ క్రీడను మోదీ ప్రారంభించారని, ఈ క్రీడలో చివరకు దేశంలో ప్రజాస్వామ్యాన్ని, భార త రాజ్యాగాన్ని బలి తీసుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సీపీఐకి చెందిన దివంగత నేత లిం గారెడ్డి ప్రథమ వర్ధంతి సభకు కూనంనేని సాం బశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అ నంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న బహుళ పార్టీ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలు మోదీ ప్రభుత్వం చేస్తోందన్నారు. దేశంలో ఎన్ని కలు ఒకేసారి జరిపితే మంచిదేనని, పార్లమెంటు, శాసనసభలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరుపాలని ఆచరణ సాధ్యం కాని ప్రతి పాదనను మోదీ ప్రభుత్వం తీసుకువస్తోంద న్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉ న్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి, ఓడిపోతా మనే భయంతో అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్ని కల చాటున గెలవాలని మోదీ చూస్తున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన చట్టపరమైన హక్కుతో కొన్ని రాష్ట్రాలు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టడంతో ముందస్తుకు వెళ్లే అవకాశాలు ఉంటాయని, దీంతో జమిలీ ఎన్నికలు నిర్వహించి ప్రయోజనం ఉండదన్నారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేయాలని వామపక్ష పార్టీలు భావించినా కేసీఆర్‌ వైఖరి వల్ల ఆ పార్టీలో విడిపోయామన్నారు. ఆ తర్వాత రాబోయే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌లను ఓడించే క్రమంలో కలిసివచ్చే వారితో నడుస్తా మని అన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.బాల్‌నర్సింహ, రాష్ట్ర కార్యవర్గ స భ్యులు వార్ల వెంకటయ్య, కేశవులుగౌడ్‌, ఏసయ్య పాల్గొన్నారు.

లింగారెడ్డి ఆశయాలను కొనసాగిస్తాం

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమానికి ఊపిరిపోసి గీటురాయిగా నిలిపిన భారత కమ్యూనిస్టు పార్టీ మాజీ దివంగత నేత మాడుగుల లింగారెడ్డి ఆశయాలను కొనసాగిస్తా మని కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రం పరిధిలోని ఉయ్యాలవాడ సమీపంలో మాడ్రన్‌ బీఈడీ కళాశాలలో నిర్వహించిన లింగారెడ్డి ప్రథమ సంస్మరణ సభ కు కూనంనేని ముఖ్య అతిథిగా హాజరై, ప్రసం గించారు. అంతకుముందు కళాశాలకు ఎదురుగా ప్రధాన రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన లింగారెడ్డి స్మారక స్తూపాన్ని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆవిష్కరించి, నివాళులు అర్పించారు. కార్య క్రమంలో కందాల రామకృష్ణ, లింగారెడ్డి సతీ మణి మల్లీశ్వరిదేవి, కుమారులు అజయ్‌ కుమార్‌రెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి, కుమార్తె రజిత, అల్లుడు సంజీవరెడ్డి, మనుమరాలు డాక్టర్‌ సుజి త, ఉమ్మడి పాలమూరు జిల్లా కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-04T23:03:57+05:30 IST