కార్పొరేట్‌కు దోచిపెడుతున్న మోదీ ప్రభుత్వం
ABN , First Publish Date - 2023-02-07T00:14:40+05:30 IST
మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ సంపద ను కార్పొరేట్‌కు దోచిపె డుతోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగం శశీధర్‌రెడ్డి ఆరో పించారు.

- కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎస్‌బీఐ ఎదుట ధర్నా
నాగర్‌కర్నూల్ టౌన్, ఫిబ్రవరి 6: మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ సంపద ను కార్పొరేట్‌కు దోచిపె డుతోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగం శశీధర్‌రెడ్డి ఆరో పించారు. సోమవారం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రవేటీకరణను నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వ ర్యంలో జిల్లా కేంద్రంలోని ఎస్‌బీఐ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎల్‌ఐసీ, బ్యాంకింగ్ రంగాలను ప్రవేటీకరించి కార్పొరేట్ శక్తులైన అదానీ, అంబానీలకు లక్షల కోట్లు దోచిపెడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అర్థం రవి మాట్లాడుతూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టు ప్రకారం అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అక్రమాలపై సుప్రీకోర్టు, పార్లమెంటరీ కమిటీ ఆధ్వర్యంలో నిష్ప.క్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిమ్మాజిపేట పాండు, నాయకులు కోటయ్య, లక్ష్మయ్య, బాలగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటయ్యగౌడ్, కౌన్సిలర్లు నిజాముద్దీన్, సునేంద్ర, సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.