సోనియాగాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం

ABN , First Publish Date - 2023-06-02T23:49:19+05:30 IST

తెలంగాణ అమరవీరుల త్యాగాలను గౌరవించి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చుతూ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని డీసీసీ అధ్యక్షుడు వాకిటి శ్రీహ రి, మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌ రెడ్డిలు అన్నారు.

సోనియాగాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం
పేటలో సోనియాగాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

నారాయణపేట/మాగనూరు/నర్వ/ఊట్కూర్‌/మరికల్‌, జూన్‌ 2 : తెలంగాణ అమరవీరుల త్యాగాలను గౌరవించి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చుతూ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని డీసీసీ అధ్యక్షుడు వాకిటి శ్రీహ రి, మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌ రెడ్డిలు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినో త్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని చిట్టెం నర్సిరెడ్డి చౌరస్తాలో సోనియాగాంధీ చిత్రపటానికి నాయకులు క్షీరాభిషేకం చేసి సంబురాలు జరుపు కున్నారు. అంతకుముందు డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి, టీపీసీసీ సభ్యుడు చిట్టెం అభిజయ్‌రెడ్డి, చిట్టెం పర్నికరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా, మాగనూ రులో సోనియాగాంధీ చిత్రపటానికి పార్టీ నాయ కులు, కార్యకర్తలు క్షీరాభిషేకం చేశారు. కాంగ్రెస్‌ మండల మాజీ అధ్యక్షుడు, మాజీ సర్పంచు ఆనంద్‌గౌడ్‌, చక్రపాణిరెడ్డి, కృష్ణయ్య, బసవరాజ్‌, ఆనంద్‌, మారెప్ప, భీమప్ప, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నర్వ మండల కేంద్రం లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు వేర్వేరుగా దశాబ్ది ఉత్సవాల ను నిర్వహించారు. ఊట్కూర్‌లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీకి కృతజ్ఞతగా ఆమె చిత్రపటానికి కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు యజ్ఞేశ్వర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొక్కు లింగంలు క్షీరాభిషేకం చేశారు. మరికల్‌లో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బెళగుంది వీరన్న ఆధ్వ ర్యంలో ఇందిరాగాంఽఽధీ విగ్రహానికి పూలమాల వేసి, ఆమె చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. యువజన కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు అంజి రెడ్డి, గొల్ల కృష్ణయ్య, గోవర్ధన్‌, టైషన్‌ రఘు తది తరులున్నారు.

తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్‌

మక్తల్‌ : తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను మోస పూరిత ఆలోచనలతో సీఎం కేసీఆర్‌ దగా చేస్తు న్నారని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు వాకిటి శ్రీ హరి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత తొమ్మిదేళ్ల నుంచి ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడికి వెళ్లాయన్నారు. ఇచ్చిన హామీలు విస్మరించిన కేసీఆర్‌కు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు గుణపాఠం చెబు తారన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాం గ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నర్సిము లు, మండల అధ్యక్షుడు గణేష్‌కుమార్‌, నాయ కులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T23:49:19+05:30 IST