చిట్‌ ఫండ్స్‌ నిర్వాహకులు వేధిస్తున్నారు

ABN , First Publish Date - 2023-03-30T23:41:26+05:30 IST

తాను చెల్లించాల్సిన డబ్బు మొత్తం చెల్లించినా చిట్‌ఫండ్‌ కంపెనీ నిర్వాహకులు తనను సంప్రదించకుండా తనకు ష్యూరిటీగా ఉన్న వ్యక్తులకు నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని నాగర్‌కర్నూల్‌ అడిషినల్‌ ఎస్పీ సీహెచ్‌ రామేశ్వర్‌ గురువారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని టుటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు.

చిట్‌ ఫండ్స్‌ నిర్వాహకులు వేధిస్తున్నారు

- అడిషనల్‌ ఎస్పీ ఫిర్యాదు

మహబూబ్‌నగర్‌, మార్చి 30 : తాను చెల్లించాల్సిన డబ్బు మొత్తం చెల్లించినా చిట్‌ఫండ్‌ కంపెనీ నిర్వాహకులు తనను సంప్రదించకుండా తనకు ష్యూరిటీగా ఉన్న వ్యక్తులకు నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని నాగర్‌కర్నూల్‌ అడిషినల్‌ ఎస్పీ సీహెచ్‌ రామేశ్వర్‌ గురువారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని టుటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. రామేశ్వర్‌ తన అవసరాల నిమిత్తం 2014లో మహ బూబ్‌నగర్‌లో విఽధులు నిర్వర్తిస్తున్న సమయంలో కపిల్‌ చిట్‌ఫండ్‌లో రూ. 5 ల క్షల చీటీ వేశారు. నెలకు రూ. 10 వేలు వాయిదా చెల్లించాల్సి ఉంది. చీటీ ఎత్తుకున్న తరువాత చివరి రూ.20 వేలు పెండింగ్‌ ఉండగా వాటిని తరువాత కంపెనీ బాయ్‌ కు పంపించగా అతను కంపెనీకి చెల్లించకుండా ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాడు. కాగా రూ. 20 వేలు తమకు జమ కాకపోవడంతో అధికారి రామేశ్వర్‌ పేరిట డ్యూగా పెట్టుకున్న కంపెనీ ఆ తరువాత కొన్నాళ్ళకు చీటీ ఎత్తుకున్న సమయంలో ష్యూరిటీలుగా ఉన్న వ్యక్తులకు డబ్బులు చెల్లించాలని నోటీసులు ఇచ్చింది. వారి నుంచి స్పందన రాకపోవడంతో కోర్టులో కేసు నమోదు చేశారు. దీంతో అసలు తనను సంప్రదిస్తే జరిగిన విషయాలను వివరించేవాడినని, తనను సంప్రదించ కుండానే తన ష్యూరిటీలకు నోటీసులు ఇచ్చి అవమానిస్తున్నారని ఆయన పోలీసు లకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు.

Updated Date - 2023-03-30T23:41:26+05:30 IST