దివ్యాంగుల జీవితాల్లో మార్పు తీసుకురావాలి
ABN , Publish Date - Dec 23 , 2023 | 11:05 PM
దివ్యాంగుల జీవితాల్లో మార్పు తీసుకరావాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కార్యదర్శి రాధమ్మ అన్నారు.
నారాయణపేట టౌన్, డిసెంబరు 23 : దివ్యాంగుల జీవితాల్లో మార్పు తీసుకరావాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కార్యదర్శి రాధమ్మ అన్నారు. శనివారం పేట సీఐటీయూ కార్యాలయంలో దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కార్యవర్గ సమావేశం ఆ సంఘం అధ్యక్షుడు కాశప్ప అధ్యక్షత నిర్వహించగా, రాధమ్మ మాట్లాడారు. దివ్యాంగుల గౌరవం, హక్కులు, శ్రేయస్సు కోసం పని చేయాలని ఐక్యరాజ్య సమితి కమిటీ పిలుపునిచ్చిందన్నారు. మన దేశంలో ప్రభుత్వాలు మారుతున్నా దివ్యాంగుల జీవితాలు మారడం లేదన్నారు. ప్రభుత్వాలు దివ్యాంగుల జీవితాల మార్పుకు కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఉచిత ప్రయాణం, పింఛన్ పెంపు, బాక్‌లాగ్ పోస్టులు, 2016 చట్టం అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు బాల్‌రాజ్, నారాయణ, హన్మంతు, ఆయా మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.