బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మహేష్
ABN , First Publish Date - 2023-03-05T23:26:25+05:30 IST
తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్టర నూతన అధ్యక్షుడిగా వంగూరు మండలంలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన గొడుగు మహేష్ ఏకగ్రీవంగా ఎన్నికైయ్యాడు.
వంగూరు, మార్చి 5 : తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్టర నూతన అధ్యక్షుడిగా వంగూరు మండలంలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన గొడుగు మహేష్ ఏకగ్రీవంగా ఎన్నికైయ్యాడు. ఆదివారం హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్య వర్గ సమావేశంలో అధ్యక్షుడిగా గొడుగు మహేష్ ఎన్నికై, మాట్లాడారు. రాష్ట్రంలో బీసీ సంక్షేమ వసతిగృహాలకు, గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, కార్పొరేట్ కళాశాలల దోపిడీ విధానంపై రాజీ లేకుండా పోరాడుతామన్నారు. నియామకానికి సహకరించిన సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌కు, రాష్ట్ర అధ్య క్షుడు బైరి రవికృష్ణకు, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు కుల్కచెర్ల శ్రీనివాస్‌కు, తాటికొండ విక్రమ్‌గౌడ్‌లకు ఈ సందర్భంగా మహేష్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పూలమాలలు, శాలువాలతో వారు మహేష్‌ను ఘనంగా సన్మానించారు.