పేదోళ్ల దేవుడు సర్వాయి పాపన్న: శ్రీనివాస్‌గౌడ్‌

ABN , First Publish Date - 2023-08-17T23:26:28+05:30 IST

తెలంగాణ తొలి బహుజన వీరుడు, పేదలపాలిట దేవుడు సర్దార్‌ సర్వాయి పాపన్న అని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. రాచరికపు వ్యవస్థలో జమీందార్లు, జాగీర్దార్‌ల ఆరాచకాలను సహించలేక కత్తిపట్టి పోరాడిన ధీశాలి అని కొనియాడారు.

పేదోళ్ల దేవుడు సర్వాయి పాపన్న: శ్రీనివాస్‌గౌడ్‌
సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

పాలమూరు, ఆగస్టు 17: తెలంగాణ తొలి బహుజన వీరుడు, పేదలపాలిట దేవుడు సర్దార్‌ సర్వాయి పాపన్న అని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. రాచరికపు వ్యవస్థలో జమీందార్లు, జాగీర్దార్‌ల ఆరాచకాలను సహించలేక కత్తిపట్టి పోరాడిన ధీశాలి అని కొనియాడారు. గురువారం జిల్లా కేంద్రంలోని గ్రీన్‌బెల్టు ఏరియాలో సర్దార్‌ సర్వాయి పాపన్న విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాపన్న పేదలపాలిట రాజుగా ఆభివర్ణించారు. దళిత, బహుజ నులు ఐక్యతతో పోరాడితేనే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన సామాన్యుడు సర్దార్‌ సర్వాయి పాపన్న అని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో పాపన్న ఖ్యాతి గడించాడంటే చిన్నవిషయం కాదన్నారు. పాపన్న వీరత్వానికి గుర్తుగా లండన్‌ మ్యూజియంలో విగ్రహాన్ని పెట్టిన విషయం గుర్తు చేశారు. పేదల పట్ల ఎంతో ప్రేమ, దయ ఉన్న సీఎం కేసీఆర్‌ వల్లే అభివృద్ధి పరుగులు తీస్తోందన్నారు. మహబూబ్‌నగర్‌ ఊహించనివిధంగా అభివృద్ధి చెందుతోందని, దీన్ని చూసి ఓర్వలేని కొందరు దుర్మార్ఘులు కుట్రలు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో గీత సహకార కార్పొరేషన్‌ చైర్మన్‌ పల్లె రవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు, కౌన్సిలర్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌, రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌గౌడ్‌, చక్రవర్తి, జిల్లా రైతుబంధు చైర్మన్‌ గోపాల్‌యాదవ్‌, శాంతన్న, మునిసిపల్‌ చైర్మన్‌ కేసీ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-17T23:26:28+05:30 IST