ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు
ABN , First Publish Date - 2023-08-02T23:37:56+05:30 IST
ఆర్డీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే బండ్ల కృషమోహన్‌రెడ్డి అన్నారు.
- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
- సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
గద్వాల క్రైం/ గద్వాల టౌన్/ గట్టు, ఆగస్టు 2 : ఆర్డీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే బండ్ల కృషమోహన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఆర్టీసీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. వారి స్థితిగతులు తెలిసిన కేసీఆర్ ఇటీవల నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ఎవరూ ఊహించిన విధంగా ఆర్డీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించి అందరి మన్ననలు పొందాడన్నారు. గద్వాల నియోజకవర్గంలో 450 మంది ఆర్డీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా అవకాశం లభించనున్నదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులకు గద్వాల నియోజక వర్గ ప్రజలు, ఆర్డీసీ కార్మికుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, డీసీసీబీ డైరక్టర్ సుభాన్, ఎంపీపీ రాజారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ తిమ్మారెడ్డి, మునిసిపల్ వైస్‌చైర్మన్ బాబర్ పాల్గొన్నారు.
వైద్య సేవల్లో అన్ని రాష్ట్రాలకు ఆదర్శం
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో తెలంగాణ అన్ని రాష్ర్టాలకు ఆదర్శమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. జిల్లా ఆస్పత్రికి కేటాయించిన 108, 102 అంబులెన్స్‌లను బుధవారం స్థానిక మునిసి పల్ కార్యాలయం వద్ద మునిసిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్‌లతో కలిసి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే, సీఎం కేసీఆర్ ముందు చూపు, మంత్రి హరీశ్‌రావు నాయకత్వంలో వైద్యరంగం అభివృద్ధి చెందుతోందన్నారు. జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరు కావడం, ఇప్పటికే నర్సింగ్ కళాశాల ఉండటం, 300 పడకల ఆస్పత్రి అందుబాటులోకి రావడంతో జిల్లా ప్రజలు మెరుగైన వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లే ఇబ్బంది తప్పిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పల్లె దవాఖానాలు, పట్టణాల్లో బస్తీ దవాఖానాల పేరున నిరుపేదలకు వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ బాబర్, మల్దకల్ ఎంపీపీ రాజారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్లు నరహరిగౌడ్, నాగిరెడ్డి, శ్రీనుముదిరాజ్, టి.దౌలు, మహేష్, రైతుబంధు సమితి మల్దకల్ మండల అధ్యక్షుడు తాటికుంట మధుసూదన్ రెడ్డి, నాయకులు గోవిందు, సాయిశ్యాంరెడ్డి, ధర్మనాయుడు, సీతారామిరెడ్డి, షుకూర్, జనార్ధన్ రెడ్డి, కురుమన్న, రామకృష్ణశెట్టి, సుధాకర్, వంశీ, చిన్న పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ
గద్వాల మండల పరిధిలోని కాకులారం గ్రామానికి చెందిన పద్మకు మెరుగైన చికిత్స కోసం సీఎం సహాయ నిధి నుంచి రూ.36,000 మంజూరయ్యాయి. దీనికి సంబంధించిన చెక్కును జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు నర్సింహులు ఉన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
గట్టు మండల పరిఽదిలోని మాచర్లకు చెందిన బీఅర్‌ఎస్ కార్యకర్త జంగిలి రమేష్ అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బుధవారం గ్రామానికి వెళ్లి రమేష్ భౌతికకాయంపై పూలమాల వేసి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండా లని వారికి తెలిపారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు హన్మంతునాయుడు, మాచర్ల సర్పంచ్ సిద్ధిరామప్ప, పార్టీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, ఎంపీపీ విజయ్, బీఅర్‌ఎస్ నాయకుడు అంగడి బస్వరాజ్, నీలకంఠం తదితరులు ఉన్నారు.