Share News

నడిగడ్డ కళా వైభవాన్ని కాపాడుకుందాం

ABN , Publish Date - Dec 22 , 2023 | 10:57 PM

నడిగడ్డలో కళాకారులకు కొదవ లేదని, ప్రతిభను పట్టుదలతో ప్రద ర్శించి కళావైభవాన్ని కాపాడుకుందామని డీవైఎస్‌వో డాక్టర్‌ బీఎస్‌ ఆనంద్‌ అన్నారు.

నడిగడ్డ కళా వైభవాన్ని కాపాడుకుందాం
జానపద నృత్యాన్ని ప్రదర్శిస్తున్న ఉండవల్లి కేజీబీవీ విద్యార్థినులు

- డీవైఎస్‌వో డాక్టర్‌ బీఎస్‌ ఆనంద్‌

- ఉత్సాహంగా యువ కళాకారుల ప్రదర్శనలు

గద్వాల టౌన్‌, డిసెంబరు 22 : నడిగడ్డలో కళాకారులకు కొదవ లేదని, ప్రతిభను పట్టుదలతో ప్రద ర్శించి కళావైభవాన్ని కాపాడుకుందామని డీవైఎస్‌వో డాక్టర్‌ బీఎస్‌ ఆనంద్‌ అన్నారు. స్వామీ వివేకానంద జయంతి, 27వ జాతీయ యువజనోత్సవాల్లో భాగంగా శుక్రవారం పట్టణంలోని బాలభవన్‌ ఆడిటోరియంలో జిల్లా స్థాయి యువ కళాకారుల ఎంపిక ప్రదర్శనలు నిర్వహించారు. ఉత్సవాలను ప్రారంభించిన అనంతరం డీవైఎస్‌వో మాట్లాడుతూ జిల్లా స్థాయిలో మొదటి బహుమతిని సాధించిన వారు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హులవుతారని తెలిపారు. ఈ పోటీలకు జిల్లాలోని వివిధ మండలాల నుంచి 250 మందికి పైగా యువ కళాకారులు హాజర య్యారు. వారికి ఆంగ్లం, హిందీ ఉపన్యాసం, వ్యాసరచన పోటీలతో పాటు జానపద నృత్యం, గేయాల్లో వ్యక్తిగత, సామూహిక బృందం విభాగాల్లో వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. పోటీల్లో జిల్లా స్థాయి ప్రథమ విజేతలుగా రాజేశ్వరి (ఆంగ్ల ఉపన్యాసం), రాజరాజేశ్వరి (హిందీ ఉపన్యాసం), లతాగౌరి, తులసీబాయి (వ్యాస రచన), హారిక (సోలో నృత్యం), శైలజ (పోస్టర్‌ మేకిం గ్‌), డింపుల్‌ (సోలో నృత్యం), తేజశ్రీ, శైలజ (జానపద గేయాలు) నిలిచారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఎంఏఎల్‌డీ కళాశాల అధ్యాపకులు కృష్ణ మూర్తి, హరినాగభూషణం, బాలభవన్‌ ఇన్‌చార్జి సత్య నారా యణ, రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు వేణుగోపాలచారి వ్యవహరించారు. కార్యక్రమానికి వ్యాయామ ఉపాధ్యా యులు నాగేష్‌ బాబు, బీసన్న, నరసింహరాజు, రాజేందర్‌ తదితరులు హాజరయ్యారు.

Updated Date - Dec 22 , 2023 | 10:57 PM