బీజేపీని గద్దెదింపుదాం
ABN , First Publish Date - 2023-03-02T23:59:39+05:30 IST
కేంద్రంలో బీజేపీని గద్దె దింపేవారకు పోరాడుదామని మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. వంట గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ గురువారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌర స్తాలో ఖాళీ సిలిండర్లతో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు.
మహబూబ్‌నగర్, మార్చి 2: కేంద్రంలో బీజేపీని గద్దె దింపేవారకు పోరాడుదామని మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. వంట గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ గురువారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌర స్తాలో ఖాళీ సిలిండర్లతో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ ప్రభు త్వం దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచుతున్నారని, ఇప్పుడు మూడు రాష్ట్రాల ఎన్నికలు పూర్తికాగానే గ్యాస్ సిలిండర్ పై రూ.50 పెంచారని విమర్శించారు. బీజేపీ పాలనకు ముందు రూ.400కు వచ్చే గ్యాస్ సిలిండర్ ఎనిమిదేళ్లలో మూడింతలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం వేళ గ్యాస్ ధరలు పెంచి మహిళలకు కన్నీరు తెప్పిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్నారు. ఎడాదికి 2కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి మాట తప్పారని, ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామని చెప్పి రూ.15 కూడా జమచేయలేదని విమర్శించారు. దేశ సంపదను అదాని, అంబానికి దోచిపెడుతున్నారని, వారిపై మోదీకి ఎందుకంత ప్రేమ అని ప్రశ్నించారు.
దేశంలోనే కాలుష్యాన్ని నివారించే లిథియం గిగాసెల్ ఎలక్ట్రికల్ బ్యాటరీ పరిశ్రమ ను జిల్లాకు తీసుకువస్తే దానిపైనా దుష్ప్రచారం చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. తెలంగా ణలో అమలవుతున్న పథకాలు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలుకావాలని ఆయా రాష్ట్రా ల ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణను చూసి నేర్చుకునేది పోయి తెలంగాణ గొంతు పిసికే పని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టడం మీ జేజెమ్మ తరంకాదని, ఆయనను కాపాడుకోవడానికి కోట్ల మంది ప్రజలు ఉన్నా రని అన్నారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతే మా బతుకులేం కావాల ని ప్రశ్నించారు. ప్రజల బతుకులు ఆగం చేస్తు న్న బీజేపీని దించేవరకు పోరాటం ఆగదని, అవసరమైతే లక్షల మందితో ఢిల్లీని ముట్టడి స్తామని హెచ్చరించారు.
చిన్నపిల్లల్లా తిరుగుతున్నారు
ఇవాళ పాలమూరులో మాజీ మంత్రులు కలర్లేసుకుని, మేము ముసలోళ్లం కాదు చిన్న పిల్లలమే అని తిరుగుతున్నారని అన్నారు. చాలా సార్లు మంత్రులుగా పనిచేసి ఈ ఉమ్మ డి జిల్లాకు ఏమి ఒరగబెట్టారని ప్రశ్నిం చారు. ఎవరికైనా ఉద్యోగం ఇప్పించారా..? పరిశ్రమలు తీసుకువచ్చారా..? హాస్పిటల్ బాగుచేసిండ్రా..? ఇళ్లుకట్టిం చారా.. ఎవరినైనా ఆదుకున్నారా అని ప్రశ్నించారు. అనంతరం ర్యాలీగా అంబేడ్కర్ చౌరస్తాకు చేరుకుని నిరన కార్యక్రమం ముగిం చారు. మంత్రి నల్లదుస్తులు ధరించి ప్లకార్డుల తో నిరసనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్‌గౌడ్, కోరమోని నర్సింహు లు, ఎంకన్న, గోపాల్‌యాదవ్, గణేష్, కోర మోని వెంకటయ్య, అబ్దుల్ రహమాన్, శాంత న్న, గిరిధర్‌రెడ్డి, సుఽధాశ్రీ, శివరాజ్ పాల్గొన్నారు.