ఆరోగ్య భారత్‌ను నిర్మిద్దాం

ABN , First Publish Date - 2023-05-31T23:25:12+05:30 IST

పొగాకు వ్యతిరేక దినం సంద ర్భంగా తెలంగాణ బెటాలియన్‌ ఎస్‌సీసీ విద్యార్థులు అవగాహన, జాగృతి కార్యక్రమాలు నిర్వహించారు.

ఆరోగ్య భారత్‌ను నిర్మిద్దాం
జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహిస్తున్న ఎన్‌సీసీ విద్యార్థులు

- పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు

మహబూబ్‌నగర్‌ టౌన్‌, మే 31 : పొగాకు వ్యతిరేక దినం సంద ర్భంగా తెలంగాణ బెటాలియన్‌ ఎస్‌సీసీ విద్యార్థులు అవగాహన, జాగృతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌సీసీ క్యాడెట్‌లను ఉద్దేశించి కల్నల్‌ జీబీఎంకే రావు మాట్లాడుతూ పొగాకు వలన కలిగే అనేక అనర్థాలను నివారించటానికి సమాజాన్ని జాగృతం చేయాలని అన్నారు. ఆరోగ్య భారత్‌ ను నిర్మిద్దామని అన్నారు. గ్రామా లు, పట్టణాలలో అనేక మంది పొగాకు బానిసలు అవుతున్నారని, బీడీలు చుట్టలు, సిగరెట్లు, హుక్కా, గుట్కా, తంబాకు, జర్దా వంటి వాటి కి ప్రతీ ఒక్కరు దూరంగా ఉండా లని అన్నారు. వీటిని తీసుకోకుండా సమాజాన్ని జాగృతం చేయాలని కోరారు. యువత ఫ్యాషన్‌ పేరుతో వీటిని ప్రారంభించి చివరకు రోగులుగా మారుతున్నారని అన్నా రు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల షాషాబ్‌గుట్ట నుంచి ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుబేదార్‌ మేజర్‌ కుల్‌దీప్‌సింగ్‌, జేసీవోలు జర్నెల్‌ సింగ్‌, వీరేందర్‌ సింగ్‌, సురేందర్‌పాల్‌సింగ్‌, హవల్దార్‌ గురుదీప్‌ సింగ్‌, మందీప్‌సింగ్‌, రాకేష్‌సింగ్‌, ఎన్‌సీసీ అధికారులు కెప్టెన్‌ డాక్టర్‌ ఎం విజయకుమార్‌, లెఫ్టెనెంట్‌ టి. రాజేశ్వరి, కరుణాకర్‌, ఎన్‌, రాజశేఖర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ జనార్దన్‌గౌడ్‌, 165 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

భూత్పూర్‌లో వైద్యబృందం ర్యాలీ

భూత్పూర్‌ : బీడి, సిగరేట్లు తాగడం పూర్తిగా మానేస్తేనే ఆరోగ్యంగా జీవిస్తారని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అదనపు అధికారి డాక్టర్‌ భాస్కర్‌ నాయక్‌ అన్నారు. బుధవారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి పెద్దమొత్తంలో వైద్య సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. అనంతరం చౌరస్తాలో వైద్యాధికారులు పొగాకు తాగడం వల్ల కలిగే అనర్థాల గురించి స్థానికులకు వివరించారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధమని, ఒక వేళ ధూమపానం తాగిన వారిపై చట్టపరంగా రూ.200అపరాధ రుసు విధించనున్నట్లు భాస్కర్‌నాయక్‌ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ బిల్లకంటి శంకర్‌, జిల్లా ఎన్‌సీడీ ప్రోగ్రాం అఽధికారి డాక్టర్‌ సంధ్యాకిరణ్మయి, జిల్లా కో-ఆర్డినేటర్‌ దత్తాత్రేయరావు, మండల వైద్యాధికారి డాక్టర్‌ అబ్దుల్‌ రబ్‌, సీహెచ్‌వో రామయ్య, పీహెచ్‌ఎన్‌ ఎలిజబెత్‌రాణి, సూపర్‌వైజర్‌ రమేష్‌కుమార్‌, హెల్త్‌అసిస్టెంట్‌ శ్రీనివాసులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-05-31T23:25:12+05:30 IST