కొప్పుల హరీశ్వర్‌రెడ్డి మృతి తీరని లోటు

ABN , First Publish Date - 2023-09-23T23:24:35+05:30 IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ స్పీకర్‌, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి మృతి బీఆర్‌ఎస్‌ పార్టీకి, తెలంగాణ ప్రజలకు తీరనిలోటని ఎక్సైజ్‌ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

కొప్పుల హరీశ్వర్‌రెడ్డి మృతి తీరని లోటు
హరీశ్వర్‌రెడ్డి మృతదేహం వద్ద నివాళ్లు అర్పిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

- ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహమ్మదాబాద్‌, సెప్టెంబరు 23 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ స్పీకర్‌, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి మృతి బీఆర్‌ఎస్‌ పార్టీకి, తెలంగాణ ప్రజలకు తీరనిలోటని ఎక్సైజ్‌ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శుక్రవారం రాత్రి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి గుండె పోటుతో మృతి చెందగా, శనివా రం పరిగిలో ఆయన నివాసంలో హరీశ్వర్‌రెడ్డి మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు ఓదార్చి, ధైర్యం చెప్పారు. హరీశ్వర్‌రెడ్డి మృతితో మహమ్మదాబాద్‌, గండీడ్‌ మండలాలకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాపతినిధులు హాజరై మృతదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళ్లు అర్పించారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ పార్టీల నాయకులు హాజరై నివాఽళ్లు అర్పించారు .

విశ్వకవి గుర్రం జాషువా

హన్వాడ : గుర్రం జాషువా తన రచనలతో సామాజిక దురాగతాలపై పోరాడారని ఆబ్కారీ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శని వారం హన్వాడ ప్రెస్‌ క్లబ్‌లో బుద్ధ ఆరామ నిర్మాణ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గుర్రం జాషువా జయంతిని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి హాజరై జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. బుద్ధ ఆరామ జిల్లా కమిటీ అధ్యక్షుడు బాలకిష్టయ్య, బుద్ధ సొసైటీ ఇండియా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ నాగ య్య, ప్రవీణ్‌కుమార్‌, ఎమ్మార్పీఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి జంబులయ్య, నాయకులు శ్రీనివాసులు, వెంకటయ్య, గంగాపురి, గోపాల్‌, రాములు, జగన్‌, అంజిలయ్య పాల్గొన్నారు.

ప్రజలు సుఖశాంతులతో ఉండాలి

మహబూబ్‌నగర్‌ టౌన్‌ : విఘ్నాలు తొలగి, ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని విఘ్నేశ్వరుడిని వేడుకున్నట్టు రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడల శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో కమలాగార్డెన్‌, ఎర్ర సత్యం చౌరస్తా, క్లాక్‌టవర్‌ వద్ద ప్రతిష్ఠించిన వినాయక మండపాల వద్ద గణేష్‌ పూజల్లో పాల్గొన్న మంత్రి అక్కడ అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రూ. 50 లక్షలతో తెలంగాణ చౌరస్తా సమీపంలో భవన్‌ నిర్మింపచేసి ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్‌ గంజి వెంకన్న, బీఆర్‌ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్‌, మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ షబ్బీర్‌, కౌన్సిలర్లు కిషోర్‌, రామ్‌ లక్ష్మణ్‌, నాయకులు రామకృష్ణ పాల్గొన్నారు.

బైపాస్‌ రోడ్డు పనులు వేగవంతంగా చేపట్టాలి : మంత్రి

మహబూబ్‌నగర్‌ : చిన్నదర్పల్లి-పాలకొండ బైపాస్‌ రహదారి పనులను వేగంగా చేపట్టాలని, పనుల్లో ఎక్కడా నాణ్యతాలోపం తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలని ఆబ్కారీ శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులను ఆదేశించారు. చించోళి- భూత్పూర్‌ జాతీయరహదారి పనుల్లో భాగంగా చిన్నదర్పల్లి నుంచి పాలకొండ వరకు జరుగుతున్న బైపాస్‌ రహదారి నిర్మాణ పనులను శనివారం చిన్నదర్పల్లివద్ద మంత్రి పరిశీలించారు.

Updated Date - 2023-09-23T23:24:35+05:30 IST