నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ చెలగాటం
ABN , First Publish Date - 2023-03-18T23:00:51+05:30 IST
నిరుద్యోగులతో చెలగాటం ఆడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గద్దెదిగాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.

గద్వాల క్రైం, మార్చి 18 : నిరుద్యోగులతో చెలగాటం ఆడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గద్దెదిగాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీపై విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టపోయిన ప్రతీ నిరుద్యోగికి రూ. లక్ష ఆర్థిక సాయం అందించాలని, నూతన నోటిఫికేషన్ జారీ చేసి నిరుద్యోగులకు ఫ్రీకోచింగ్‌తో పాటు వసతి, ఆహారం ఉచితంగా ఇవ్వాలన్నారు. తక్షణమే నిరుద్యోగ భృతి అమలు చేయాలన్నారు. సంవత్సరానికి రెండు సార్లు టెట్ నిర్వహించారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ప్రజలు నమ్మి ఓటేస్తే రెండు సార్లు గెలిచి కూడా ప్రజలను నట్టేటా ముంచివేసిన ఘనత బీఆర్‌ఎస్‌దే అన్నారు. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే సీఎం కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఎగ్బోటే, అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు, పట్టణ అధ్యక్షుడు బండల వెంకట్రాములు, జిల్లా ఉపాఽధ్యక్షుడు జమ్మిచేడు ఆనంద్, కౌన్సిలర్ రజక జయశ్రీ, నాయకులు చిత్తారికిరణ్, బలరాంరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.