తండాలకు గుర్తింపు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే
ABN , First Publish Date - 2023-09-26T23:13:08+05:30 IST
తండాలకు గుర్తింపు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు.
- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
- బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిక
గద్వాల న్యూటౌన్/ గద్వాల, సెప్టెంబరు 26 : తండాలకు గుర్తింపు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. కేటీదొడ్డి మండల పరిధిలోని పూజారి తండా సర్పంచ్ ఆంజనేయులు ఆధ్వర్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు మంగళవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారిలో బీజేపీ మండల అధ్యక్షురాలు కమలమ్మ, లక్ష్మి, శాంతమ్మ, వెంకటమ్మ, వాల్యానాయక్, గుణ్యనాయక్‌లతో పాటు మరికొందరు ఉన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ రాష్ట్రంలో గిరిజన తండాలకు అధిక నిధులు కేటాయిస్తుండటంతో అభివృద్ధి పరుగులు పెడ్తోంద న్నారు. రాబోయే ఎన్నికలలో మరోసారి ముఖ్యమంత్రి గా కేసీఆర్‌ను, ఎమ్మెల్యేగా తనను మరోసారి ఆశీర్వ దించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మల్దకల్ ఎంపీపీ రాజారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్, వైస్ ఎంపీపీ రామకృష్ణనాయుడు, మండల అధ్యక్షు డు ఉరుకుందు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరక్టర్ సురేష్, నాయకులు పాల్గొన్నారు.
- ధరూరు మండల పరిధిలోని వావనంపల్లిలో బొడ్రాయి ఏర్పాటుకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సతీమణి బండ్ల జ్యోతి రూ.50 వేలు ఆర్థిక సాయం అందించారు.
సంక్షేమ పథకాల వల్లే పార్టీలో చేరికలు
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలతో ఆకర్షి తులై పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కాకులారం గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మంగళవారం సాయంత్రం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారిలో ఉప సర్పంచు జయన్న, వార్డు మెంబర్లు వెంకటరాజారెడ్డి, సుధాకర్, చిన్ననాగన్న, మాజీ వార్డ్ మెంబర్ సుధాకర్‌నాయుడు, హరిజన జయన్నతో పాటు మరి కొందరు ఉన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాలకు మంచి చేయడమే బీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరక్టర్ సుభాన్, సీనియర్ నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, నర్సింహులు, వీరబ్రహ్మం, రామచంద్రుడు, వెంకటేష్ పాల్గొన్నారు.
అర్హులైన వారికి త్వరలోనే ఇళ్ల పట్టాలు
అర్హులైన వారందరికీ త్వరలోనే ఇళ్ల పట్టాలు అందిస్తామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. పేదల ఇళ్ల కోసం ఉద్దేశించిన పట్టణ సమీ పంలోని స్థలాన్ని మంగళవారం ఆయన పరిశీలిం చారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, కౌన్సిలర్లు మురళి, శ్రీను ముదిరాజ్, కృష్ణ, పార్టీ పట్టణ అధ్యక్షుడు గోవిందు, ఉపాధ్యక్షుడు ధర్మ నాయుడు, నాయకులు కోటేష్, శ్రీనివాస్ రెడ్డి, నాగు లుయాదవ్, సీతారాములు, రంజిత్‌కుమార్, కృష్ణ, వీరేష్ ఉన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన ఆయిల్ ఫెడ్ చైర్మన్
అలంపూర్ చౌరస్తా : ఆయిల్ ఫెడ్ రాష్ట్ర చైర్మన్ రామకృష్ణరెడ్డి, ఎండీ సురేందర్‌రెడ్డిలతో పాటు ఇతర ముఖ్య అధికారులు మంగళవారం అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహాంను కలిశారు. వచ్చే నెల మూడున బీచుపల్లి వద్ద ఉన్న విజయవర్ధిని ఆయిల్ మిల్లును పునఃప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఎమ్మెల్యేను కోరారు. రోజుకు 600 టన్నుల అయిల్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని, దాదాపు 400 మంది కిఉపాధి కలుగుతుందని చెప్పారు.