దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు కేసీఆర్
ABN , First Publish Date - 2023-09-26T23:14:43+05:30 IST
ప్రజా సంక్షేమం కోసం సాహసోపేత నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు.
- అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహాం
- కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ
ఉండవల్లి, సెప్టెంబరు 26 : ప్రజా సంక్షేమం కోసం సాహసోపేత నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు. మండల పరిధిలోని ఇటిక్యాలపాడు గ్రామంలో బీసీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి మంగళవారం సర్పంచు లోకేశ్వర్ రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో ఇప్పటికే రూ.50 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. రూ.38 లక్షల వ్యయంతో బీసీ భవనాన్ని నిర్మించనున్నామన్నారు. సీఎం కేసీఆర్ నాయక త్వంలో అన్ని వర్గాలు, అన్ని మతాల ప్రజలకు సమన్యాయం జరుగుతోందన్నారు. గృహలక్ష్మి, దళిత బంధు పథకాలు అర్హులైన వారందరికీ తప్పనిసరిగా అందుతాయని తెలిపారు. ఎవరికీ ఒక్క పైసా కూడా ఇవ్వకూడదన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు బెల్లంలేని భక్ష్యాల్లాంటివని ఎద్దేవా చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ, వివిధ పార్టీల నాయకులు పిట్టలదొర వేషంలో వచ్చి మాయ మాటలు చెప్తారని, వాళ్లు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ పథకాలు అమలవుతున్నాయా అని వాళ్లను నిలదీయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దేవన్న, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బైరాపురం రమణ, ఉప సర్పంచు శ్రీదేవి, నాయకులు వెంకట్ గౌడు, నరసింహ, ఈదన్న, ప్రసాద్, ఉండవల్లి ఎంపీటీసీ సభ్యుడు సుంకన్న, పీఆర్‌ఏఈ నరేందర్ పాల్గొన్నారు.
ఎల్‌వోసీ అందజేత
వడ్డేపల్లి, సెప్టెంబరు 26 : వడ్డేపల్లి మండలం జిల్లేడుదిన్నె గ్రామానికి చెందిన ఎల్లప్పకు మెరుగైన చికిత్స కోసం సీఎం సహాయ నిధి నుంచి రూ.2.50 లక్షలు మంజూరయ్యాయి. దీనికి సంబంధించిన ఎల్‌వోసీ, చెక్కులను అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం మంగళవారం బాధితుడి కుటుంబసభ్యులకు అందిం చారు. అనారోగ్యంతో బాధపడ్తున్న వారు మెరుగైన చికిత్స కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాశపోగు రాజు, ఎంపీపీ రజితమ్మ, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, సర్పంచు ఆంజనేయులు, మార్కెట్ యార్డు డైరెక్టర్ మహేష్ పాల్గొన్నారు.