కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
ABN , First Publish Date - 2023-02-21T23:19:49+05:30 IST
వరంగల్‌లో నిర్వహించిన హాత్ సేహాత్ కార్యక్రమంలో యువ జన కాంగ్రెస్ నాయకుడు పవన్‌పై బీఆర్‌ఎస్ నా యకులు చేసిన దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ నాయ కులు పాలమూరులో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు.
- వరంగల్‌లో కాంగ్రెస్ నాయకుడిపై దాడికి నిరసన
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 21 : వరంగల్‌లో నిర్వహించిన హాత్ సేహాత్ కార్యక్రమంలో యువ జన కాంగ్రెస్ నాయకుడు పవన్‌పై బీఆర్‌ఎస్ నా యకులు చేసిన దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ నాయ కులు పాలమూరులో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. టీపీసీసీ పిలుపుమేర కు మంగళవారం తెలంగాణ చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దహనం చేశారు. అనం తరం నాయకులు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక వి ధానాలను హాత్ సేహాత్ కార్యక్రమం ద్వారా ప్రజ ల్లోకి తీసుకెళ్లడాన్ని జీర్ణించుకోలేని బీఆర్‌ఎస్ గుం డాలు ఇలాంటి దాడులకు పాల్పడటం దారుణమ న్నారు. బీఆర్‌ఎస్ బెదిరింపులకు భయపడేది లేద న్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజ లను మభ్యపెట్టే చర్యలకు పాల్పడుతున్న కేసీఆర్ ప్రభుత్వ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడతామని అన్నారు. బీఆర్‌ఎస్ పాలనపై ప్రజలు తీవ్ర అసం తృప్తితో ఉన్నారని, రేవంత్‌రెడ్డి పాదయాత్రకు వ స్తున్న స్పందన చూసి ఓర్వలేకే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. వసంత, చంద్ర శేఖర్‌గౌడ్, లక్ష్మణ్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, వెంకట య్య, సాయిబాబ, రాములుయాదవ్, నరేశ్, అబ్దు ల్‌హక్, రాఘవేందర్, నాగరాజు, రమేశ్‌నాయక్, జా కీర్, రమేశ్, సంజీవ్‌రెడ్డి తదితరులున్నారు.