కేసీఆర్‌ పాలమూరు రుణం తీర్చుకోలేవ్‌

ABN , First Publish Date - 2023-05-26T00:48:02+05:30 IST

‘సీఎం కేసీఆర్‌.. నీ చర్మం వలిచి చెప్పులు కుట్టించినా.. పాల మూరు ప్రజల రుణం తీర్చుకోలేవు, నిన్ను కరీంనగర్‌లో ఓడి స్తారని భయపడి, పాలమూరుకు వచ్చి ఇక్కడ ప్రజల కడుపులో తల, పాదాలపై చేతులు పెట్టి ప్రాధేయపడితే నిన్ను పూలపల్లకిలో పార్లమెంట్‌కు పంపిన గొప్ప చరిత్ర పాలమూరు ప్రజలది...

కేసీఆర్‌ పాలమూరు రుణం తీర్చుకోలేవ్‌
జడ్చర్ల బహిరంగ సభలో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

- పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజం

- భట్టి విక్రమార్క పాదయాత్ర నేపథ్యంలో జడ్చర్లలో బహిరంగసభ

- పాలమూరులో సాగునీటి వసతి కల్పించిందే కాంగ్రెస్‌ : సీఎల్పీ నేత భట్టి

మహబూబ్‌నగర్‌/జడ్చర్ల, మే 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘సీఎం కేసీఆర్‌.. నీ చర్మం వలిచి చెప్పులు కుట్టించినా.. పాల మూరు ప్రజల రుణం తీర్చుకోలేవు, నిన్ను కరీంనగర్‌లో ఓడి స్తారని భయపడి, పాలమూరుకు వచ్చి ఇక్కడ ప్రజల కడుపులో తల, పాదాలపై చేతులు పెట్టి ప్రాధేయపడితే నిన్ను పూలపల్లకిలో పార్లమెంట్‌కు పంపిన గొప్ప చరిత్ర పాలమూరు ప్రజలది... అలాంటి పాలమూరును నిలువునా మోసం చేశావు. చరిత్రగల ఈ గడ్డ నిన్ను క్షమించదు’’ అని పీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క చేపట్టిన పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్ర 800 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో పీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుధ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిం చిన భారీ బహిరంగసభలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. పాల మూరు జిల్లా రెండు మొక్కలను పెంచి పెద్ద చేసిందని, అందు లో ఒక మొక్క తానైతే, మరో మొక్క సీఏం కేసీఆర్‌ అని పేర్కొ న్న ఆయన, తాను తెలంగాణ సమాజం కోసం పీసీసీ అధ్యక్షు డిగా పాలమూరు బిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకగా పనిచేస్తుంటే సీఏం కేిసీఆర్‌ మాత్రం పాలమూరు రుణం తీర్చుకునే అవకా శం వచ్చినా, దగా చేసిన విషయాన్ని పాలమూరు ప్రజలంతా గమనించాలన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో పాలమూరుకు ఒరి గిందేమి లేదని, వలసలు ఆగలేదని, ఆత్మహత్యలను నివారించ లేదని, పంటలు ఎండుతూనే ఉన్నాయని, ట్రాన్స్‌ఫార్మర్‌లు కాలిపోతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పీజీ, పీహెచ్‌డీలు చేసిన పాలమూరు పేద బిడ్డలు ఉద్యోగాలు రాక, హైదరాబాద్‌లో ఆటోలు తోలుతున్న దుస్థితి నెలకొందన్నారు. మిడ్జిల్‌ ప్రజల ఆశీర్వాదంతో జడ్పీటీసీగా రాజకీయాల్లోకి వచ్చిన తాను పోరాడుతున్న వైనాన్ని మెచ్చి, సోనియాగాంధీ తనకు రాష్ట్రాన్ని నడిపే పీసీసీ బాధ్యతలు ఇచ్చిందని పేర్కొన్నా రు. పాలమూరు-రంగారెడ్డి పథకాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తాన న్న సీఏం మాట తప్పారని, తనపై కక్షతో 130 కేసులు పెట్టి వేధించడమే కాకుండా తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తీసుకువచ్చిన 69జీవో ద్వారా అమలు చేయాల్సిన కొడంగల్‌- నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని సైతం పక్కన పెట్టారని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో సిద్దిపేట, గజ్వేల్‌, సిరిసిల్లకే నిధులు వెళ్తున్నాయని, కానీ రాబోయే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పాలమూరు ఎత్తిపోతల పథకమేకానీ, కొడంగల్‌- నారాయణపేట పథకాన్ని పూర్తిచేస్తామని హమీ ఇచ్చారు. వెనకబడిన ఆలంపూర్‌ ప్రాంతానికి ఇప్పటి వరకు ఎవరు సరైన ప్రాతినిఽథ్యం ఇవ్వలేదని, సంపత్‌కుమార్‌ లాంటి యువకుడికి కాంగ్రెస్‌ పార్టీ ఏఐసీసీ అవకాశం కల్పించిందని, ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాబోయే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఆయన కీలకవ్యక్తి అవుతారని హమీ ఇచ్చారు. జడ్చర్ల ఎమ్మెల్యేపై రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేసారు. మూడు సార్లు ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే, ఒక సారి మంత్రిగా అవకాశం వచ్చినా, జడ్చర్లకు ఆయన చేసిందేమీ లేదని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల కోసమే తప్ప ప్రజల కోసం ఆయన పట్టించుకోడని, కనీసం జడ్చర్ల ఆసుపత్రిలో జనరేటర్‌ పెట్టించలేకపోయాడని విమ ర్శించారు. ఒక్క జడ్చర్లలోనే కాకుండ ఉమ్మడి పాలమూరు జిల్లాలో అభివృద్ధి ఏమైనా జరిగిందంటూ ఉంటే కాంగ్రెస్‌ హ యాంలోనేనని, ఈ విషయంపై చర్చించేందుకు తాను పాల మూరు మర్రిచెట్టు వద్దకైనా, అంబేడ్కర్‌ విగ్రహం వద్ద అయి నా చర్చకు సిద్ధమని, బీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధమా అని రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ పాలమూ రు-రంగారెడ్డిను లక్ష్మీదేవిపల్లి వరకు కుర్చీ వేసుకుని కట్టిస్తా నన్న సీఏం కేసీఆర్‌ కుర్చీ దొరకనందుకే ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టారా అని ప్రశ్నించారు. ప్రాజెక్ట్‌ కింద భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇస్తామని, భూమికి భూమి, ఇంటికి ఇళ్లు ఇస్తామని, హమీలు ఇచ్చి, ఇప్పుడు బలవంతంగా భూములు లాక్కుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని హమీ ఇచ్చారు. పాలమూరు జిల్లాకు కాంగ్రెస్‌ హయాంలోనే జూరాల, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ తదితర పథకాలను ఇచ్చామని, పాల మూరు-రంగారెడ్డి పథకానికి రాబోయే కాంగ్రెస్‌ పాలనలో యేడాది కాలంలో పూర్తి చేస్తామని హమీ ఇచ్చారు. పేదలకు బియ్యమే కాకుండా తొమ్మిది నిత్యావసర వస్తువులు ఇస్తామని హమీ ఇచ్చారు. అనిరుధ్‌రెడ్డి సభనిర్వహణ బాధ్యతలను భుజాన వేసుకుని విజయవంతం చేశారని ప్రశంసించడం పట్ల అనిరుధ్‌రెడ్డి వర్గం సంతోషం వ్యక్తం చేసింది.

అనిరుధ్‌రెడ్డికి సమయం చూసి రేవంత్‌ టికెట్‌ ప్రకటిస్తారు : కోమటిరెడ్డి వ్యాఖ్య

జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ సమన్వయకర్త జనంపల్లి అనిరుధ్‌రెడ్డికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సమయం చూసు కుని కాంగ్రెస్‌ టికెట్‌ ప్రకటిస్తారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లాలో తాము 12కు 12 ఎమ్మెల్యే సీట్లు గెలిపిస్తామని, పీసీసీ అధ్యక్షుడి స్వంత జిల్లా పాలమూరులో 14కు 12 సీట్లు గెలిపిస్తే, రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ తాను పాలమూరు జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా రెండున్నరేళ్లు పనిచేశానని, తాము ఆ సమయంలో చేసిన అభివృద్ధి తప్ప, ఈ తొమ్మిదేళ్లలో ఏమీ చేయలేదన్నారు.

పీపుల్స్‌మార్చ్‌తో బీఆర్‌ఎస్‌ నేతల్లో వణుకు :

జనంపల్లి అనిరుధ్‌రెడ్డి

పీసీసీ ప్రధానకార్యదర్శి జనంపల్లి అనిరుధ్‌రెడ్డి మాట్లాడు తూ పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్రతో జడ్చర్లలో బీఆర్‌ఎస్‌ నేతల్లో వణుకు మొదలయ్యిందని, ఈ రోజు కాంగ్రెస్‌ బహిరంగసభ నేపథ్యంలోనే హడావిడిగా వంద పడకల ఆసుపత్రిని ప్రారం భించేందుకు సిద్ధమయ్యారని అన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు ఎర్రశేఖర్‌ మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క రాష్ట్రంలో చెరో వైపున ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారని, అడుగు, అడుగునా బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారని, ప్రజల కష్టాలు తీర్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం రాబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుడు జి.మధుసూధన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, హన్మంత్‌ రావు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి నాగంజనార్దన్‌రెడ్డి, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరివెంకట్‌, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, సంపత్‌కుమార్‌, వంశీచంద్‌రెడ్డి, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లు అంజన్‌కుమార్‌యాదవ్‌, మహేష్‌గౌడ్‌, ఉపాధ్యక్షులు డాక్టర్‌ మల్లురవి, వేంనరేందర్‌రెడ్డి, ఒబేదుల్లాకొత్వాల్‌, ప్రధానకార్య దర్శులు ప్రదీప్‌గౌడ్‌, సంజీవ్‌ముదిరాజ్‌, డీసీసీ అధ్యక్షులు వాకిటి శ్రీహరి, డాక్టర్‌ వంశీకృష్ణ, ప్రభాకర్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్‌ యాదవ్‌, హర్షవర్దన్‌రెడ్డి, దుష్యంత్‌రెడ్డి, రబ్బానీ, మఖ్తల్‌ ప్రశాం త్‌కుమార్‌రెడ్డి, కొండాప్రశాంత్‌రెడ్డి, బెనహర్‌, లక్ష్మణ్‌యాదవ్‌, మహిళ కాంగ్రెస్‌ నేతలు వసంత, బెక్కరి అనిత, నిత్యానందం, అశోక్‌యాదవ్‌, మినాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T00:48:02+05:30 IST