కమనీయం రాములోరి కల్యాణం

ABN , First Publish Date - 2023-03-30T23:44:10+05:30 IST

జిల్లా కేంద్రం లో శ్రీరామనవమి పర్వదిన వేడుకలను పట్టణ ప్ర జలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

కమనీయం రాములోరి కల్యాణం
నాగర్‌కర్నూల్‌లో మంగళ సూత్రాన్ని చూపెడుతున్న అర్చకుడు

- జిల్లా వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు

- పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, మార్చి 30: జిల్లా కేంద్రం లో శ్రీరామనవమి పర్వదిన వేడుకలను పట్టణ ప్ర జలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణంలోని సీతారామస్వామి ఆలయంలో వార్డు కౌన్సిలర్‌ బా దం సునీత నరేందర్‌, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు బాదం రమేష్‌ ఆధ్వర్యంలో రాములోరి కల్యాణం వైభవంగా జరిపించారు. స్వామివారి కల్యాణానికి ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమ ర్పించి వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు కందాడై వరదాచార్యులు ఆధ్వర్యంలో వేద పం డితుల మంత్రోచ్ఛారణతో స్వామివారి కల్యాణం క నుల పండువగా జరిపించారు. కల్యాణంలో పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తిలకించి తీర్థ ప్ర సాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణంలో భక్తు ల కోసం ఎంజేఆర్‌ ట్రస్టు, బీజేపీ అసెంబ్లీ నియోజ కవర్గ ఇన్‌చార్జి దిలీప్‌ ఆధ్వర్యంలో వారి వారి ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేసి మంచినీరు, పండ్లు, ప్రసాదాలు పంపిణీ చేశారు. డీసీసీబీ డైరెక్టర్‌ జక్కా రఘునం దర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ కల్పన, బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జి దిలీప్‌పాల్గొన్నారు.

- అచ్చంపేట అర్బన్‌: సీతారాముల కల్యాణ మహోత్సవం వేదపండితుల మంత్రోచ్ఛారణలతో అంగరంగ వైభవంగా గురువారం నిర్వహించారు. పట్టణంలోని భ్రమరాంబికా దేవి, కన్యాకా పరమేశ్వ రి ఆలయంలో ఆలయ అధ్యక్షుడు నల్లపు శ్రీనివాసులు, బంధం రాజు ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో సీతారాముల కల్యాణం ఘనంగా ని ర్వహించారు. భ్రమరాంబికా దేవి ఆలయ పునః నిర్మాణ కమిటీ అధ్యక్షుడు పి.మనోహర్‌ ఇంటి నుంచి స్వామివారిని బాజాభజంత్రిలతో ఆలయం వద్దకు తీసుకెళ్లారు. అర్చకులు ఉదయ్‌ భాస్కర్‌, కాటేపల్లి శ్రీనివాసులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వ హించారు. సీతారాముల కల్యాణానికి పట్టణంతో పాటు పరిసరా గ్రామాల నుంచి పెద్దఎత్తున భక్తు లు తిలకించేందుకు ఆలయాలకు చేరుకున్నారు. ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు సతీమణి గువ్వల అమలతో కలిసి కల్యాణోత్సవం తిలకించి ప్రత్యేక పూజలు చేశారు. భ్రమరాంబికా దేవి ఆలయ మ హిళా కమిటీ అధ్యక్షులు సత్యమ్మ, శ్రీదేవిలు ప్రభు త్వ విప్‌ దంపతులను శాలువాతో ఘనంగా సన్మా నించారు. ఆయా ఆలయాలలో భక్తులకు అన్నదా న కార్యక్రమం ఏర్పాటు చేశారు. కల్యాణానికి ముందురోజు రాత్రి 10గంటల సమయంలో సీతా రాములకు ఉట్లకోనేరు వద్ద ఎదురు సన్నాహాలు నిర్వహించారు. మునిసిపల్‌ చైర్మన్‌ నర్సింహగౌడ్‌, ఆయా ఆలయాల అధ్యక్ష్య కార్యదర్శులు కొరివి చంద్రశేఖర్‌, భగీరథ్‌నాథ్‌, మల్లేష్‌, విజయ్‌ కుమార్‌, కర్ణస్వామి, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-30T23:44:59+05:30 IST