కాలరాత్రి దేవిగా అమ్మవారు
ABN , First Publish Date - 2023-10-21T23:07:31+05:30 IST
అష్టాదశ శక్తి పీఠాలలో ఐదో శక్తి పీఠమైన జోగుళాంబ అమ్మవారు దసరా శరన్నవరాత్రులలో భాగంగా ఏడో రోజు శనివారం కాళరాత్రి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
అష్టాదశ శక్తి పీఠాలలో ఐదో శక్తి పీఠమైన జోగుళాంబ అమ్మవారు దసరా శరన్నవరాత్రులలో భాగంగా ఏడో రోజు శనివారం కాళరాత్రి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి భయానక రూపాల్లో ఇది ఒకటి. ఈ దేవి శరీరం ఛాయ చీకటితో నల్లగా ఉంటుంది. అందుకే ఈ దేవికి కాళరాత్రి అనే పేరు వచ్చింది. ఈ దేవి వాహనం గాడిద. ఎల్లప్పుడూ శుభ ఫలితాలు ఇస్తుంది కనుక ఈ దేవిని శుభకరీ అని కూడా అంటారు. కాళరాత్రిదేవి పగలు, రాత్రి పాలిస్తుంది. ఆమె కిరీటాన్ని సహస్ర చక్రమని పిలుస్తారు.
- అలంపూరు