నిఖిత కుటుంబానికి న్యాయం చేయాలి
ABN , First Publish Date - 2023-04-03T23:16:53+05:30 IST
నిఖిత కుటుంబానికి న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు.
- హత్య చేసిన వారే ఆత్మహత్యగా చిత్రీకరించారు
- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ
- ఈనెల 8న శ్రీశైలం-హైదరాబాద్ హైవే దిగ్భందం
అచ్చంపేట టౌన్, ఏప్రిల్ 3 : నిఖిత కుటుంబానికి న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని టీఎన్‌జీవో భవనంలో వామపక్షాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ, బీజేపీ సీనియర్ నాయకుడు సతీష్ మాదిగ లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ నిఖిత ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారన్నారు. నిఖిత ఉన్న ఎత్తుకు ఆమె ఫ్యాన్ కు ఉరి వేసుకునేంత అవకాశం లేదన్నారు. గురుకులం లోని ఇద్దరి ఉపాధ్యాయుల అసాంఘిక కార్యకలాపాల ను చిన్నారి చూసిందని.. ఎక్కడా బయటపడతారేమో నన్న భయంతో నిఖితను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీ కరించారన్నారు. హత్య చేయడానికి గల కారణాలేమీ, ఎలా జరిగిందనే దానిపైనే తాము ప్రశ్నిస్తున్నామన్నా రు. నిఖిత కుంటుబానికి ప్రభుత్వం వెంటనే రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగిన సమయంలో ఆదరబాదరగా డాక్టర్లు అర్ధరాత్రి పోస్టుమార్టం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. త్వరలో కలిసికట్టుగా ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. ఈనెల 8న శ్రీశైలం - హైదరాబాద్ హైవే దిగ్భందంతో పాటు, 16న ఛలో అచ్చంపేట కార్యక్రమంతో ధర్నా నిర్వహిస్తా మన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయ కులు సౌటకాశీం, సీపీఎం నాయకులు దేశ్యనాయక్, రామనాథం, మల్లిఖార్జున్, శివ, రవి, కార్యకర్తలు తదితరులున్నారు.