ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ విజేత మూలమల్ల

ABN , First Publish Date - 2023-03-30T23:10:28+05:30 IST

మండల పరిధిలోని కొమిరెడ్డి పల్లి గ్రామంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ విజేతగా వనపర్తి జిల్లా ఆత్మకూర్‌ మండలం మూలమల్ల గ్రా మ టీం విజేతగా నిలిచింది.

ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ విజేత మూలమల్ల
కబడ్డీ విజేతలకు నగదుతో పాటు షీల్డ్‌లను అందజేస్తున్న గ్రామ సర్పంచ్‌ సాయిరెడ్డి తదితరులు

మూసాపేట, మార్చి 30 : మండల పరిధిలోని కొమిరెడ్డి పల్లి గ్రామంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ విజేతగా వనపర్తి జిల్లా ఆత్మకూర్‌ మండలం మూలమల్ల గ్రా మ టీం విజేతగా నిలిచింది. కొమిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీరామ నవమి ఉత్సవాల సందర్బంగా హనుమాన్‌ యూత్‌ క్లబ్‌ ఆధ్వ ర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించగా 50 టీంలు పాల్గొన్నాయి. బుధవారం రాత్రి వరకు కొనసాగిన కబడ్డీ పోటీల్లో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు మధుసూ దన్‌రెడ్డి, పార్టీ సంయుక్త కార్యదర్శి కొండ ప్రశాంత్‌రెడ్డి పాల్గొ ని ఫైనల్‌ పోటీలను ప్రారంభించారు. టోర్నీలో విజేతగా మూలమల్ల గ్రామ టీం మొదటి స్థానంలో నిలువగా ద్వితీయ స్థానంలో వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌ మండలం కంచిరావుపల్లి గ్రామ టీం కైవసం చేసుకుంది. తృతీయ స్థానం నారాయణపేట జిల్లా మరికల్‌ మండల కేంద్రం టీం, నాల్గవ స్థానం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రం టీం కైవసం చేసుకోవ డంతో గెలుపొందిన టీంలకు ప్రథమ రూ:20వేలు, ద్వితీయ రూ:15 వేలు, తృతీయ రూ.10 వేలు, నాల్గవ రూ.7,500 నగ దు ప్రోత్సాహాన్ని అబ్జెక్టివ్‌ టెక్నాలజీ సోలీషన్‌ ప్రైవేటు లిమి టెడ్‌ కంపెనీ సిబ్బంది సూర్యప్రకాశ్‌ అందజేశారు. గెలు పొందిన టీం సభ్యులకు నగదుతో పాటు, షీల్డ్‌లను సర్పంచ్‌ సాయిరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు సంతోష, మాజీ ఎంపీపీ బగ్గి కృష్ణయ్య అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ రఘు పతి, సింగిల్‌ విండో డైరెక్టర్‌ పటేల్‌ నర్సింహ్మరెడ్డి, వివిధ గ్రా మాల క్రీడాకారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-30T23:10:28+05:30 IST