ఉద్యోగాలను అమ్ముకుంటున్నారు

ABN , First Publish Date - 2023-03-31T00:00:54+05:30 IST

రాష్ట్రంలో నిరుద్యోగలైన పేదలకు ఉద్యోగాలు రాకుండా అమ్ముకుంటున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు.

ఉద్యోగాలను అమ్ముకుంటున్నారు
శాంతినగర్‌లో చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌

- వడ్డేపల్లి, పైపాడులో రాజ్యాధికార యాత్ర

వడ్డేపల్లి, మార్చి 30 : రాష్ట్రంలో నిరుద్యోగలైన పేదలకు ఉద్యోగాలు రాకుండా అమ్ముకుంటున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు. ఎండాకాలమే కాకుండా, అన్ని కాలాల్లో ప్రజల దాహం తీర్చేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా గురువారం సాయంత్రం వడ్డేపల్లి మండలంలోని పైపాడు, బుడమొర్సు, రాజోలి, శాంతినగర్‌ గ్రామాల్లో ఆయన పర్యటించి ప్రజలతో మాట్లాడారు. రాష్ట్రంలో అట్టడుగు వర్గాలను చైతన్యం చేసి బహుజన రాజ్యం సాధించడమే తన లక్ష్యమన్నారు. పైపాడు ప్రభుత్వ పాఠశాలలో కనీస సదుపాయాలు లేవని అసహనం వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అడిగే ధైర్యం అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిలకు లేదన్నా రు. రాష్ట్రంలో దొరల పాలన అంతం కావాలంటే బీఎస్పీకి ఓటు వేయాల న్నారు. అనంతరం మునిసిపాలిటీ కేంద్రమైన శాంతినగర్‌లో ఆయన చలివేంద్రం ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా బాధ్యులు కేశవరావు, కృష్ణ, రాజు, మధుసూదన్‌గౌడ్‌, వెంకట్‌రెడ్డి, లక్ష్మన్న, రవిచందర్‌, వడ్డేపల్లి, అయిజ, రాజోలి మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు.

రానున్నది బహుజన రాజ్యం

ఇటిక్యాల/ అలంపూర్‌ చౌరస్తా : రానున్నది బహుజన రాజ్యమని, బీఎస్పీ ద్వారానే నిరుపేదలకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తా, ఉండవల్లి మండలం అలంపూర్‌ చౌరస్తాల్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కేశవరావు, జిల్లా ఇన్‌చార్జి ఎంజీ కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి మణికుమార్‌, గద్వాల నియోజకవర్గ నాయకుడు వెంకట్‌రెడ్డి, మండల కన్వీనర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-31T00:00:54+05:30 IST