ఎర్రవల్లి మండల ఏర్పాటుపై జీవో విడుదల
ABN , First Publish Date - 2023-08-28T23:23:34+05:30 IST
ఎర్రవల్లి నూతన మండలానికి సోమవారం రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేసింది.
ఎర్రవల్లి చౌరస్తా, ఆగస్టు 28 : ఎర్రవల్లి నూతన మండలానికి సోమవారం రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. హైదరాబాద్‌లోని సెక్ర టేరియట్‌లో జాయింట్ సెక్ర టరీ రాంబాబుతో అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం జీవో కాపీని అందుకున్నారు. 11 రెవెన్యూ గ్రామాలను కలుపుకొని ఎర్రవల్లి నూతన మండలంగా పాలన కొనసాగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జిల్లాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎర్రవల్లి గ్రామం మండలంగా ఏర్పడటంతో ప్రభుత్వానికి, అలంపూర్ ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలుపుతూ ఎర్రవల్లి చౌరస్తా కూడలిలో బీఆర్‌ఎస్ నాయకులు బాణసంచా కాల్చారు. కార్యక్రమంలో భీమేశ్వర్‌రెడ్డి, రాగన్న, రాముడు, కృష్ణసాగర్ తదితరులున్నారు.