లబ్ధిదారులకు చెక్కుల అందజేత
ABN , First Publish Date - 2023-09-14T23:40:12+05:30 IST
వివిధ పథకాల ద్వారా పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి గురువారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో చెక్కులు అందించారు.
- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల న్యూటౌన్/ధరూరు, సెప్టెంబరు 14 : వివిధ పథకాల ద్వారా పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి గురువారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో చెక్కులు అందించారు. బీసీ కులవృత్తిదారులకు ఆర్థిక సాయం పథకం ద్వారా గద్వా ల మండలం కొండపల్లి గ్రామానికి చెందిన రమేశ్‌కు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి లక్ష రూపాయల చెక్కును అందించారు. కార్యక్రమంలో ఎంపీపీలు విజయ్, రాజారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు ప్రభాకర్, రైతు బంధు సమితి గద్వాల మండల అధ్యక్షుడు గోపిరెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- గద్వాల మండలం సంగాల గ్రామానికి చెందిన గోపికి మెరుగైన వైద్యం కోసం సీఎం సహాయనిధి నుంచి రూ.60 వేలు మంజూరయ్యాయి. దీనికి సంబం ధించిన ఎల్‌వోసీ, చెక్కులను గురువారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారుడికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అందించారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం మల్దకల్ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, సర్పంచ్ రాజు పాల్గొన్నారు.
ప్రతీ ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి
ప్రతీ ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం పలువురికి ఆయన ఎల్‌ఎల్‌ఆర్ ధ్రువపత్రా లను అందించారు.
ఎమ్మెల్యే దంపతుల పూజలు
శ్రావణమాసం ముగింపు సందర్భంగా గురువారం ధరూరు మండల పరిధిలోని పెద్ద చింతరేవుల ఆంజ నేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, బండ్ల జ్యోతి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు వారికి అర్చకుడు చక్రపాణి జోషి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ధర్మకర్త సి.గిరిరావు ఆదరంగా ఆహ్వానించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే దంపతులకు శేషవస్త్రం అందించి సత్కరించారు.
రాఖీ కట్టిన నీలిపల్లి మహిళలు
మల్దకల్ మండలం నీలిపల్లి గ్రామానికి చెందిన మహిళలు గురువారం గద్వాల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మీపై ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మీ వెనుక ఉండి గెలిపించుకుంటామని ఆయనకు తెలిపారు. కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ విష్ణు, నాయకులు ఉన్నారు.