సమష్టి కృషితో సమగ్రాభివృద్ధి

ABN , First Publish Date - 2023-06-03T00:03:37+05:30 IST

సమష్టి కృషి, సమన్వయంతో జిల్లా ప్రజానీకాని కి సమంగా సకల సదుపాయాలు సమకూరుతు న్నాయని ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు అన్నారు.

 సమష్టి కృషితో సమగ్రాభివృద్ధి
పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయ పతాకావిష్కరణ చేసి వందనం చేస్తున్న ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, జడ్పీ చైర్‌పర్సన్‌ శాంతకుమారి, కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌

- రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు

- రాబోయే కాలంలో రాష్ట్రానికే దార్శనికంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా

- వ్యవసాయం, విద్య, వైద్యారోగ్య రంగాలకు పెద్దపీట వేస్తామని వెల్లడి

నాగర్‌కర్నూల్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): సమష్టి కృషి, సమన్వయంతో జిల్లా ప్రజానీకాని కి సమంగా సకల సదుపాయాలు సమకూరుతు న్నాయని ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు అన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్య రంగాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలోని బీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. రా ష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయ పతాకావిష్కరణ చేసిన అనంతరం గు వ్వల బాలరాజు ప్రసంగించారు. మానవీయ దృక్పథం, నిర్మాణా త్మకమైన ఆలోచన, దార్శనికమైన ప్రణాళిక రచన మేలు కలయి కతో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. రైతు బం ధు, కేసీఆర్‌ కిట్లు, రైతుబీమా, పింఛన్ల పంపిణీ, కుల వృత్తులకు బాసటగా నిలవడం ద్వారా అనతికాలంలోనే రాష్ట్రం అద్భుతమైన విజయాలను సాధించిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌భగీరథ, మిషన్‌ కాకతీయ, భూరికార్డుల ప్రక్షాళన, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌, గొర్రెల పంపిణీ, పాడి పరిశ్రమ అభివృద్ధికి బర్రెల పంపిణీ, మత్స్యకారుల జీవనోపాధి పెంపునకు చేపల పెం పకం వంటి ఎన్నో బృహత్తర కార్యక్రమాలు నిబద్దతతో అమలు చేయడం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కల్వకుర్తి ఎత్తి పోతల పథకం ద్వారా జిల్లాలో వ్యవసాయ సమగ్ర స్వరూపం మారిపోయిందని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో కోనసీ మకు ధీటుగా పాడి పంటలు అభివృద్ధి చెంద నున్నాయని చెప్పారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలో సాగు విస్తీర్ణం 2022-23 సంవత్సరంలో 8.89లక్షల ఎకరా లకు చేరిందని, దీని మూలంగా రైతుల నికర ఆదాయం కూడా పెరిగిందన్నారు. రైతుబంధు పథకం ద్వారా జిల్లాలో 2లక్షల 88వేల మంది రైతులకు 3వేల 236కోట్ల రూపాయలు వారి బ్యాంక్‌ ఖాతా లలో జమ చేయడం జరుగుతుందన్నారు. రైతుబీమా పథకం కింద ఇప్పటి వరకు జిల్లా లో 216.15కోట్ల రూపాయల పరిహారం చెల్లించడం జరిగిందన్నారు. సాగునీటి రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మా ర్పుల ద్వారా అచ్చంపేట, బల్మూరు మం డలాల్లో 70వేల ఎకరాలకు సాగునీరందించడానికి ఉమామ హేశ్వరం, చెన్నకేశవ రిజర్వాయర్లను నిర్మించడానికి 1534.50కోట్ల రూపాయల అంచనాతో పరిపాలన పరమైన అనుమతులు సా ఽధించినట్లు ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దళితబంధు పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 301మంది లబ్ధిదారులకు 30.10కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగిం దన్నారు. గిరిజన సంక్షేమానికి కూడా తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందని విద్య, ఉద్యోగ రంగాల్లో వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించి వారి జీవనోపాధిని మెరుగుపర్చడానికి విశేషమైన కృషి కేసీఆర్‌ హయాంలోనే జరుగుతుందన్నారు. చేపల పంపిణీ ద్వారా మత్స్యకారుల కుటుంబాల్లో కూడా ప్ర భుత్వం వెలుగులు నింపుతుందని జిల్లాలో 221 మత్స్యకార సహ కార సంఘాలను 15వేల 810మంది మత్స్యకారులకు సభ్యత్వం క ల్పించి ఇప్పటి వరకు జిల్లాలో 12.88కోట్ల చేప పిల్లలను ఉచితం గా జలాశయాల్లో వదలడం జరిగిందన్నారు. గీతా కార్మికుల సం క్షేమానికి కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రమాదవశాత్తు మర ణించిన గీత కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారాన్ని అందించడంతో పాటు మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ కులస్తులకు 15శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నట్లు తెలిపారు. పోలీస్‌ శాఖలో వస్తున్న సంస్కరణల ద్వారా జిల్లాలో నేర నియంత్రణ బేషుగ్గా ఉందన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ఇప్ప టివరకు జిల్లా వ్యాప్తంగా 1853 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేరాలను అదుపు చేస్తున్నట్లు తెలిపారు. సోషల్‌ మీడియా ద్వారా సైబర్‌ నేరాల మీద అవగాహన కల్పించడానికి జిల్లా పోలీస్‌ యంత్రాంగం చేస్తున్న కృషి ఏనలేనిదన్నారు. ఆవిర్భావ వేడుకల్లో జడ్పీ చైర్‌పర్సన్‌ శాంతకుమారి, జిల్లా కలెక్టర్‌ పి.ఉదయ్‌కు మార్‌, ఎస్పీ కే మనోహర్‌, జాయింట్‌ కలెక్టర్లు మోతీలాల్‌, మనూచౌదరిలతో పాటు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కల్పన, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ హనుమంతురావులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:03:37+05:30 IST