నంచర్ల గురుకుల పాఠశాల ఘటనపై విచారణ
ABN , First Publish Date - 2023-09-04T23:01:02+05:30 IST
‘గజ్జి, తామరతో విద్యార్థుల అవస్థ’ శీర్షికన సోమవారం ‘ఆంధ్ర జ్యోతి’లో ప్రచురితమైన వార్తా కథనానికి అధికారులు స్పందిం చారు.
మహబూబ్‌నగర్(విద్యావిభాగం), సెప్టెంబరు 4 : ‘గజ్జి, తామరతో విద్యార్థుల అవస్థ’ శీర్షికన సోమవారం ‘ఆంధ్ర జ్యోతి’లో ప్రచురితమైన వార్తా కథనానికి అధికారులు స్పందిం చారు. మహబూబ్‌నగర్ జిల్లా మహ్మదాబాద్ మండలం నంచర్ల గురుకులంలో సుమారు 50 మంది విద్యార్థులు గజ్జి, తామరతో బాధపడుతున్న ఘటనపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. విచారణ చేపట్టాలని ఆదేశించడంతో సోమవారం నంచర్ల గురుకులాన్ని సాంఘిక, సంక్షేమ ఆర్‌సీవో ఫ్లోరెన్స్‌రాణి తనిఖీ చేశారు. అక్కడ చాలా మంది విద్యార్థులకు గజ్జి, తామర సోకినట్లు గుర్తిం చారు. దీనిపై అక్కడి సిబ్బంది, ప్రిన్సిపాల్‌పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ చేపట్టి నివేదికను కలెక్టర్‌కు అందచేయనున్నట్లు ఆమె తెలిపారు.