గడ్డి తింటూ స్కూల్‌ స్వీపర్ల వినూత్న నిరసన

ABN , First Publish Date - 2023-08-22T23:35:59+05:30 IST

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ పాఠశాలల్లో పని చేస్తున్న స్వీపర్లు దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారని, వారికి వెంటనే ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పొదిల రామయ్య డిమాండ్‌ చేశారు.

గడ్డి తింటూ స్కూల్‌ స్వీపర్ల వినూత్న నిరసన
గాంధీ విగ్రహం వద్ద గడ్డి తింటూ నిరసన వ్యక్తం చేస్తున్న స్కూల్‌ స్వీపర్లు

కందనూలు, ఆగస్టు 22 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ పాఠశాలల్లో పని చేస్తున్న స్వీపర్లు దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారని, వారికి వెంటనే ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పొదిల రామయ్య డిమాండ్‌ చేశారు. మంగళవారం తెలంగాణ స్కూల్‌ స్వీపర్ల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గాంధీపార్కులో గడ్డి తింటూ వినూత్న నిరసన తెలిపారు. కార్యక్రమంలో యూ నియన్‌ జిల్లా అధ్యక్షుడు యాదగిరిగౌడ్‌, ప్రధాన కార్యదర్శి వెంకటయ్యగౌడ్‌, ర్జున్‌, మామదల్లి రామస్వామి, నారాయణగౌడ్‌, వెంకటయ్యగౌడ్‌, నారాయణ, నిరంజన్‌, పుల్లయ్య, జయమ్మ, ఆలివేలమ్మ, రామలక్ష్మమ్మ, నారాయణ, ఈశ్వరమ్మ, రామేశ్వరమ్మ పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T23:35:59+05:30 IST