అంగన్‌వాడీల వినూత్న నిరసన
ABN , First Publish Date - 2023-09-21T23:50:49+05:30 IST
మక్తల్ పట్టణంలోని అంగన్‌వాడీ కేంద్రం వద్ద గురువారం 11వ రోజు రిలే దీక్షలు కొనసాగగా, అంగన్‌వాడీలు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు.

మక్తల్, సెప్టెంబరు 21 : మక్తల్ పట్టణంలోని అంగన్‌వాడీ కేంద్రం వద్ద గురువారం 11వ రోజు రిలే దీక్షలు కొనసాగగా, అంగన్‌వాడీలు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ.26 వేలు అందించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి గోవిందరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 48ఏళ్ల నుంచి 70 వేల మంది అంగన్‌వాడీ టీచర్లు చాలీచాలని వేతనాలు తీసుకొని సేవలందిస్తున్నారన్నారు. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, పెన్షన్, ఈఎస్‌ఐ, పీఎఫ్ వర్తించడంతో పాటు అన్ని సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రాడియుటీ అమలు పర్చాలని, ఉద్యోగ విరమణ తర్వాత టీచర్లకు రూ.10 లక్షలు, ఆయాలకు రూ.ఐదు లక్షలు చెల్లించాలన్నారు. ఉద్యోగ విరమణ వయస్సు 65 నుంచి 61కి తగ్గించాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలు మంజుల, నర్సింగమ్మ, సుజాత, అనిత, అనురాధ, రాజేశ్వరి, రాధిక, భాగ్యలక్ష్మి, బసవలింగమ్మ, వెంకటమ్మ, ఉమాదేవి, మణెమ్మ, శ్రీలత, ప్రమీల, పద్మ, విజయలక్ష్మి పాల్గొన్నారు.
నారాయణపేట : జిల్లా కేంద్రంలో చేపట్టిన అంగన్‌వాడీల సమ్మెకు కోటకొండ సర్పంచ్ జయ, ఇప్ట్యూ జిల్లా కార్యదర్శి నర్సింహా మద్దతు పలకగా పేట, ధన్వాడ, ఊట్కూర్ మండల టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. అంగన్‌వాడీలకు కనీస వేతనం అమలు చేయాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఽథోడ్‌ను సీఐటీయూ నాయకులు వెంకట్రామ్‌రెడ్డి, బాల్‌రామ్ కోరారు. సమ్మెలో పాల్గొంటున్న టీచర్లపై అధికారుల వేధింపులు ఆపాలని, కేంద్రాల తాళాలు పలగొట్టిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు.