వృత్తి నైపుణ్యాలను పెంచుకోవాలి

ABN , First Publish Date - 2023-02-01T23:18:47+05:30 IST

మారుతున్న పరి స్థితులకు అనుగుణంగా ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీస్‌ సి బ్బంది తమ వృత్తి నైపుణ్యాలను పెంచుకుంటూ పో లీస్‌శాఖకు గౌరవాన్ని పెంచుతూ ప్రజలతో మమే కం కావాలని ఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు.

వృత్తి నైపుణ్యాలను పెంచుకోవాలి

- ఎస్పీ వెంకటేశ్వర్లు

- ముగిసిన మొబిలైజేషన్‌ పరేడ్‌

నారాయణపేట, ఫిబ్రవరి 1: మారుతున్న పరి స్థితులకు అనుగుణంగా ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీస్‌ సి బ్బంది తమ వృత్తి నైపుణ్యాలను పెంచుకుంటూ పో లీస్‌శాఖకు గౌరవాన్ని పెంచుతూ ప్రజలతో మమే కం కావాలని ఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. జిల్లా పోలీస్‌పరేడ్‌ మైదానంలో యాన్యువల్‌ మొబిలైజేషన్‌ ముగింపు సందర్భంగా బుధవారం సాయుధ దళాల సిబ్బందితో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ హాజ రై సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభ ద్రతల పరిరక్షణ విషయంలో వి చక్షణ కోల్పోకుండా ప్రజల హక్కులను కాపాడుతూనే శాంతి భద్రతల ను పరి రక్షించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో నూ ప్రజల్లో పోలీస్‌ శాఖపై ఉన్న గౌరవం దిగజార కుండా చూడాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నా రు. సమయం దొరికినప్పుడు వ్యాయామం చేయాల ని, ఆరోగ్యంపై దృష్టి సారించా లని సూచించారు. అ నంతరం పోలీస్‌ దర్బార్‌ నిర్వ హించి సిబ్బంది స మస్యలను అడిగి తెలుసుకున్నా రు. ఆపరేషన్‌ స్మైల్‌ లో భాగంగా జిల్లాలోని 170 మంది బాలకార్మికు ల ను పట్టుకొని బృందం సభ్యులు జోగుళాంబ జోన్‌లో మన జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని, త్వరలోనే సంబంధిత సిబ్బందికి ఐజీ నుంచి రివార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆర్‌ఐ రాఘవరావు, కృష్ణయ్య, డేవిడ్‌, ఇందిర, రామకృష్ణ, శివశంకర్‌, రిజర్వు పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:18:49+05:30 IST