బీఆర్‌ఎస్‌లో జడ్పీటీసీ చేరిక
ABN , First Publish Date - 2023-09-19T23:17:58+05:30 IST
నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం బీజేపీకి చెందిన జడ్పీటీసీ సభ్యురాలు విమలా అంజి యాదవ్ మంగళవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. నారాయణపేటలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఎస్‌ఆర్ రెడ్డి ఆమెకు కండువా కప్పి, ఆహ్వానించారు.
కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి
నారాయణపేట టౌన్, సెప్టెంబరు 19: నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం బీజేపీకి చెందిన జడ్పీటీసీ సభ్యురాలు విమలా అంజి యాదవ్ మంగళవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. నారాయణపేటలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఎస్‌ఆర్ రెడ్డి ఆమెకు కండువా కప్పి, ఆహ్వానించారు. విమలతో పాటు ఆమె అనుచరులు, నారాయణపేట మండలంలోని అభంగాపూర్, నెమళ్లపల్లి, పట్టణం లోని విశ్వ బ్రాహ్మణులు తదిత రులు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎస్‌ఆర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేప డుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకా లే బీఆర్‌ఎస్‌కు బలమని అ న్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సురేఖ, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు అంజలి, నర్సింహారెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు విజయ్ సాగర్, రాములు, సుదర్శన్, గందె చంద్రకాంత్, కన్న జగదీశ్ పాల్గొన్నారు.