అక్రమ కట్టడాలు తొలగించాలి

ABN , First Publish Date - 2023-02-21T22:53:32+05:30 IST

జిల్లాలోని అక్రమ కట్టడాలను వెంటనే తొలిగించాలని అదనపు కలెక్టర్‌ మయాంక్‌ మిట్టల్‌ అధికారులను ఆదేశించారు.

అక్రమ కట్టడాలు తొలగించాలి
టాస్క్‌ఫోర్స్‌ అధికారులతో సమీక్షిస్తున్న అదనపు కలెక్టర్‌ మయాంక్‌ మిట్టల్‌

నారాయణపేట టౌన్‌, ఫిబ్రవరి 21 : జిల్లాలోని అక్రమ కట్టడాలను వెంటనే తొలిగించాలని అదనపు కలెక్టర్‌ మయాంక్‌ మిట్టల్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్‌, పుర స్థాయి టాస్క్‌ఫోర్స్‌ సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో నాలుగు టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు ఏర్పాటు చేశా మని, ప్రతీ మునిసిపాలిటీకి ఒకటి, జిల్లా స్థాయికి ఒక కమిటీ నియమించామ న్నారు. జిల్లాలోని మూడు మునిసిపాలిటీల్లో అనధికారంగా ఉన్న కట్టడాలను గుర్తించి వెంటనే తొలగించాలని అధికారులకు సూచించారు. సంబంధిత అధికారులు అనధికార, అక్రమ కట్టడాలకు సంబంధించి నోటీసులు అందించామని అదనపు కలెక్టర్‌కు వివరించారు. పుర అధికారులు పోలీస్‌, రెవెన్యూ అధికారులతో కలిసి వాటిని తొలగించాలని, వాటికి కావల్సిన జేసీబీ, ట్రాక్టర్‌ వాహనాలను సమకూర్చుకోవాలని అదనపు కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఎస్పీ సత్యనారాయణ, సుధాకర్‌, రాములు, కమిషనర్‌ సునీత, తహసీల్దార్‌ దానయ్య, రాజు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T22:53:34+05:30 IST