ఆదరిస్తే ఐదు వందలకే సిలిండర్‌

ABN , First Publish Date - 2023-03-02T23:53:36+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు.

ఆదరిస్తే ఐదు వందలకే సిలిండర్‌
ఓ ఇంటి వద్ద కరపత్రాలు పంపిణీ చేసి ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

ఫ హాత్‌ సే హాత్‌ జోడో కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకుల స్పష్టీకరణ

ఫ పురపాలికలోని 11వ వార్డులో నాయకుల పర్యటన

మహబూబ్‌నగర్‌, మార్చి 2 : కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు. రైతులకు ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. హాత్‌ సే హాత్‌ జోడో కార్యక్రమంలో భాగంగా గురువారం పట్టణంలోని 11వ వార్డులో డీసీసీ అధ్యక్షుడు జి మధుసూదన్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఒబేదు ల్లా కొత్వాల్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు వినో ద్‌కుమార్‌, సంజీవ్‌ముదిరాజ్‌లు పర్యటించారు. గడపగడపకు తిరిగి వచ్చే ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీని ఆదరించాలని కోరారు. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పేదల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడతామని వివరిం చారు. ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, దేశంలో బీజేపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. గ్యాస్‌ ధర విపరీతంగా పెరగడం వల్ల మళ్లీ కట్టెలపొయ్యి పెట్టుకోవాల్సి వస్తోందని చెప్పారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, విద్యుత్‌ చార్జీలు ఇష్టానుసారంగా పెంచారని, నిత్యావసర సరుకుల ధరలు అకాశాన్నంటాయని ప్రజలకు వివరించారు. అందుకే పేదల కష్టాలు తీరాలంటే పేదల పక్షాన నిలబడే కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలో తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మన్‌ యాదవ్‌, సీజే బెనహర్‌, జహీర్‌అక్తర్‌, హక్‌, అవేజ్‌, లక్ష్మణ్‌, నాగరాజు, బాలస్వామి, సుభాష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-02T23:53:36+05:30 IST